Kitchenvantalu

10 నిమిషాల్లో టేస్టీ తమలపాకు రైస్… బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ

Betel Leaves Rice Recipe:10 నిమిషాల్లో టేస్టీ తమలపాకు రైస్… బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ.. తమలపాకులు పాన్ లోకే కాదు, వంటిల్లో కూడా వాడుతారు. తమలపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో,కారంగా కమ్మగ, ఘుమఘుమలు వెదజల్లే తమలపాకు అన్నం ట్రై చేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
తమలపాకుల తరుగు – 5
వండిన అన్నం – 1 కప్పు
ఉల్లిపాయ – 1 కప్పు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – 1/2టీస్పూన్
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – 1/2టీస్పూన్
అన్నం – 1.5 కప్పు

పొడి కోసం ..
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – 5
వెల్లుల్లి – 10
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్

☛ Also Read: లవంగాలతో తెల్ల జుట్టుకు చెక్: ఈ చిన్న ట్రిక్ తో నిమిషాల్లో నల్లగా మారడం ఖాయం!

తయారీ విధానం –
1.ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని, వెల్లుల్లి, మినపప్పు, వేసి, దోరగా వేయించుకోవాలి.
2. పప్పు వేగాక ఎండుమిర్చి వేసి ఆపై నువ్వులు కూడా వేసుకుని, వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే బాండీలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, చిటపటలాడనివ్వాలి.

4. అందులోకి ఉల్లిపాయ తరుగు ,ఉప్పు, పసుపు, వేసుకుని, ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి.

☛ Also Read: ఏలూరు ‘నేషనల్ మార్ట్’ (National Mart): 365 రోజులూ ఆఫర్ల పండుగ!

5. ఉల్లిపాయలు వేగిన తర్వాత తమలపాకు తరుగు వేసి, మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులోకి వండుకున్న అన్నం, గ్రైండ్ చేసుకున్న మినపప్పు పొడి వేసి, హై ఫ్లేమ్ పై టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
7. అంతే ఘుముఘుమలాడే తమలపాకు అన్నం రెడీ అయినట్లే..

☛ Also Read: కిచెన్ లో మీ పనిని సగానికి తగ్గించే సూపర్ హాక్స్! అసలు మిస్ అవ్వకండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."