Healthhealth tips in telugu

మైగ్రేన్ తలనొప్పికి తక్షణ ఉపశమనం: ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు!

Migraine Headache Home Remedies :మైగ్రేన్ తలనొప్పికి తక్షణ ఉపశమనం: ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..  మామూలుగా వచ్చే తలనొప్పిని కాస్త అశ్రద్ద చేసినా కానీ మైగ్రైన్ తలనొప్పిని అసలు అశ్రద్ద చేయకూడదు.

మైగ్రైన్ తలనొప్పి ప్రారంభంలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలలోని రక్తనాళాల మీద ఒత్తిడితో మొదలయ్యే మైగ్రేన్‌ నొప్పి నరాలకు సంబంధించిన వ్యాధి. తలలో ఒక వైపు మాత్రమే వేధిస్తుంది. కాబట్టి పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు. .

తరచూ వచ్చే ఈ నొప్పి తీవ్రత ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉంటుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా మైగ్రైన్ తలనొప్పి వస్తుంది. ఈ నొప్పిని అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించి మందులు వాడాలి. మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే తొందరగా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసం ఒక స్పూన్ ఉండేలా చూసుకోవాలి. ఈ రసంలో 5 మిరియాలను పొడిగా చేసి కలపాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమం మొత్తంను ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే క్రమంగా మైగ్రైన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

అల్లం,మిరియాలు,నిమ్మరసం తలనొప్పిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. తలనొప్పి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అలాగే పని ఎక్కువగా చేయకుండా విశ్రాంతిగా ఉండాలి. విటమిన్ సి, విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."