Face Glow Tips: బ్యూటీ పార్లర్ తో పనిలేకుండా… ఇంట్లోనే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!
skin tan removal cream at home :బ్యూటీ పార్లర్ తో పనిలేకుండా… ఇంట్లోనే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి.. ఈ మధ్య కాలంలో అడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం పట్ల శ్రద్ద పెడుతున్నారు.
ముఖ సంరక్షణలో ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. దీని కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు,మురికి వంటివి లేకుండా ముఖం తెల్లగా కాంతి వంతంగా మెరవాలంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి.
బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్థాలతో చాలా సులభంగా అందమైన కాంతివంతమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఒక గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పొడి, 4 స్పూన్ల పచ్చిపాలు వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. పాలల్లో కాఫీ పొడి., కార్న్ ఫ్లోర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే ఒక పేస్ట్ లా తయారవుతుంది. .
ఈ పేస్ట్ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే మూడు రోజులు వరకు నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ ని ముఖం మీద రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
☛ Also Read: కేవలం 1 గ్లాస్.. 7 రోజుల్లో మీ బాడీలో జరిగే మ్యాజిక్ చూస్తే మీరే షాక్ అవుతారు!
ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద జిడ్డు, మురికి, నలుపు, మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.
కాఫీలో ఉండే కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహాయపడుతుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా మృదువుగా మంచి కాంతితో మెరుస్తూ ఉంటుంది. కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి స్కిన్ కూడా హెల్దీ గా ఉంటుంది. కాఫీ పొడి చాలా సులువుగా అందుబారులో ఉంటుంది.
☛ Also Read: అరికాళ్ళ నుండి తల వరకు… మీ శరీరంలోని ఏ సమస్యనైనా తరిమికొట్టే అద్భుతమైన లడ్డు!
కార్న్ ఫ్లోర్ ముఖం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఈ ప్యాక్ తయారుచేసుకొని వాడి మచ్చలు లేకుండా తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండీ.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Source: chaipakodi.com
☛ Also Read: 24 గంటలు ఏసీలోనే ఉంటున్నారా? ఈ షాకింగ్ నిజాలు మీ కోసమే!

