Healthhealth tips in telugu

రోజుకో గ్లాస్ తాగితే చాలు.. నరాల నొప్పులు, తిమ్మిర్లు, అధిక బరువు పరార్!

Bay Leaf Drink :రోజుకో గ్లాస్ తాగితే చాలు.. నరాల నొప్పులు, తిమ్మిర్లు, అధిక బరువు పరార్.. ఈ రోజుల్లో సమస్యలు అనేవి చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. సమస్యలు ఏమి రాకుండా ఉండాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి.

ఒంటి నొప్పులు,అధిక బరువు, తిమ్మిర్లు,నరాల వాపు వంటి సమస్యలను తగ్గించుకోవటానికి ఒక డ్రింక్ తయారు చేసుకుందాం. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
sompu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త గోరువెచ్చగా అయ్యాక దానిలో రెండు చిన్న బిరియాని ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ వాము,పావుస్పూన్ సొంపు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి తాగాలి. అవసరమైతే తేనె కలుపుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.

ఈ డ్రింక్ ని ఉదయం సమయంలో తాగాలి. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగటానికి అరగంట ముందు ఏమి తీసుకోకుండా పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. శరీరంలో ఏ బాగంలో నొప్పి ఉన్న తగ్గిపోతుంది. కాళ్లు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో తిమ్మిరి ఉన్నా.. నరాల్లో వాపు ఉన్నా.. తగ్గిపోతుంది.

శరీరంలో జీవక్రియను పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుస్తుంది. అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. ఈ చిట్కాను రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి పలితం పొందవచ్చు.

నేను కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి అధిక బరువు సమస్య నుండి బయట పడ్డాను. అయితే ఈ డ్రింక్ తీసుకుంటూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ, వ్యాయామం కూడా చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."