Healthhealth tips in telugu

రోజుకో లడ్డు తినండి.. నొప్పులు, నీరసం, షుగర్ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టండి!

Nerve weakness food in Telugu :రోజుకో లడ్డు తినండి.. నొప్పులు, నీరసం, షుగర్ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టండి.. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.

సమస్య రాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతుంటారు. కంగారు పడకుండా ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా మంచి ఫలితం కనబడుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి.
jaggery Health benefits in telugu
అలాగే నడిచినప్పుడు తేలిపోతున్న భావన ఉండటం, అలాగే రాత్రి పడుకున్నప్పుడు కండరాలు పట్టేయడం శారీరక బలహీనత, శరీరంలో అసలు బలం లేనట్టు ఉండటం, అలసట, నిస్సత్తువ ఉండి ఏ పని చేయాలని అనిపించకపోవడం అధిక రక్తపోటు ముఖం కాంతి విహీనంగా మారడం, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు అన్నింటిని ఇప్పుడు తయారు చేసుకునే లడ్డు పరిష్కరిస్తుంది..

ఒక కప్పు అవిసె గింజలు గింజలు,ఒక కప్పు తెల్ల నువ్వులు వెగించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి దానిలో 10 బాదం పప్పులు,10 కిస్ మిస్ లను వేసి వెగించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి గోదుమ పిండి వేసి వెగించాలి.

ఆ తర్వాత కప్పున్నర బెల్లం తీగ పాకం కన్నా తక్కువగా పాకం పట్టుకోవాలి. ఒక బౌల్ లో అవిసెగింజల,నువ్వుల పొడి,బాదం,కిస్ మిస్ ల పొడి,గోదుమ పిండి,బెల్లం పాకం వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను రోజుకి ఒకటి తీసుకుంటే పైన చెప్పిన అన్నీ సమస్యలు తొలగిపోతాయి.

ఈ లడ్డు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక్కసారి చేసుకుంటే పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అన్నీ వయస్సుల వారు ఈ లడ్డును తినవచ్చు.

నేను రెగ్యులర్ గా ఈ లడ్డు చేస్తాను. మా ఇంటిలో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా సరే మంచి పోషకాలు ఉన్న ఆహారం తినటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."