కమ్మటి రుచితో మినుముల పులగం.. ఇలా చేస్తే ఒక్క మెతుకు కూడా మిగల్చరు!
Black Gram Khichidi:కమ్మటి రుచితో మినుముల పులగం.. ఇలా చేస్తే ఒక్క మెతుకు కూడా మిగల్చరు.. ప్రోటీన్స్ అధికంగా ఉండే మినపప్పుతో ఇడ్లీ దోసలే కాదండి.. ఎన్నో హెల్తీ ,వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు. మినుముల పులగం ఎప్పుడైనా ట్రై చేసారా లేదంటే ఇప్పుడు చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
పొట్టు మినుములు – ½ కప్పు
బియ్యం – 1 కప్పు
ఉప్పు – తగినంత
వెల్లుల్లి – 5-6
మెంతులు – 1 టేబుల్ స్పూన్
నీళ్లు – 3 కప్పులు
పచ్చికొబ్బరి తురుము – ½ కప్పు
మసాలా కోసం..
నువ్వుల నూనె – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి చీలికలు – 2
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
తయారీ విధానం
1.పొట్టు మినుములను లో ఫ్లెమ్ పై కలుపుతు దోరగా వేపుకోవాలి.
2.కుక్కర్లో కడిగిన బియ్యం,వేపుకున్న మినుములను మిగిలిన పదార్ధాలన్ని వేసి మీడియం ఫ్లేమ్ పై 4 విజిల్స్ రానివ్వాలి.
3.తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు కోసం పెట్టుకున్న పదార్ధాలను వేసి వేగిన తాలింపును పులగంలో కలుపుకోవాలి.
4.చివరగా కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మినుముల పులగం రెడీ అయినట్టే.

