సాక్స్ మురికి వదలట్లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి!
Socks Washing Tips in telugu:సాక్స్ మురికి వదలట్లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.. వర్షాకాలంలో బట్టలను ఉతకాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మురికిగా నల్లగా మారిన సాక్స్ ఉతకాలంటే పెద్ద టాస్క్ అవుతుంది.
పిల్లలు స్కూల్ కి వెళ్తూ సాక్స్ వేసుకోవడం సాధారణమే. వారు స్కూల్ నుంచి వచ్చేసరికి సాక్స్ నల్లగా మురికిగా మారిపోతాయి. వీటిని శుభ్రం చేయాలంటే కష్టం. తెల్లటి సాక్స్ లను శుభ్రం చేయటానికి ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

ఒక బకెట్ లో వేడి నీటిని పోసి రెండు స్పూన్ల బేకింగ్ పౌడర్ కలపాలి. దీనిలో మురికిగా మారిన సాక్స్ వేసి రెండు నుంచి మూడు గంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత చేతులకు డిటర్జెంట్ రాసుకొని రుద్దితే సరిపోతుంది.
ఆ తర్వాత సాక్స్ కి వెనిగర్ రాసి పావుగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయడం వలన సాక్స్ తెల్లగా మెరుస్తూ ఉంటాయి.
సాక్స్ శుభ్రం చేయడానికి నిమ్మకాయ కూడా చాలా బాగా సహాయపడుతుంది. వేడినీటిలో నిమ్మరసం, డిష్ సోప్ వేసి ఆ మిశ్రమంలో సాక్స్ లను పావు గంట సేపు నానబెట్టి అ తర్వాత రుద్ది ఉతికితే తెల్లగా మెరుస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

