కాకరకాయ కూర చేదు లేకుండా కమ్మగా రావాలంటే ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వండి.
bitter gourd Tips:”కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి కాకరకాయ ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
అయితే, ఇందులో ఉండే విపరీతమైన చేదు వల్ల చాలా మంది, ముఖ్యంగా పిల్లలు దీనిని చూస్తేనే ఆమడ దూరం పరుగెత్తుతారు. కాకరకాయ చేదుగా ఉందని దానికి దూరంగా ఉండే బదులు, వండే ముందు కొన్ని చిన్న చిన్న వంటగది చిట్కాలను పాటిస్తే దానిలోని చేదును పూర్తిగా తగ్గించవచ్చు.
కాకరకాయ కూర చేదు లేకుండా కమ్మగా రావాలంటే ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వండి. కాకరకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే చేదు కారణంగా మనలో చాలా మంది ముఖ్యంగా పిల్లలు తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. అదే కాకరకాయలో చేదు తగ్గితే తినటానికి ఆసక్తి చూపుతారు. అందువల్ల ఈ రోజు కాకరకాయ చేదు తగ్గటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
కాకరకాయ పేరు వినగానే మన అందరికీ చేదు గుర్తుకొస్తుంది. కాకరకాయ చేదు కారణంగా తినటానికి చాలామంది ఇష్టపడరు. కాకరకాయలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్… వంటి మినర్ల్స్. కెటెచిన్, గాలిక్ యాసిడ్, ఎపికెటెచిన్, క్లోరోజెనిక్ యాసిడ్… వంటి యాంటీఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి.

కాకరకాయను తరచుగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొంతమంది కాకరకాయతో వేపుడు, పులుసు వంటివి చేసుకుంటారు. మరి కొంత మంది కాకరకాయలను ముక్కలుగా కోసి ఎండబెట్టి కారం పొడి చేస్తారు. మరి కొంతమంది వడియాలు, చిప్స్ వంటివి చేస్తూ ఉంటారు. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే కాకరకాయ చేదును తగ్గించవచ్చు.
కాకరకాయ పులుసు, కూర చేసినప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తే కాకరకాయ చేదును తగ్గిస్తుంది. అలాగే కూర చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. ఈ విధంగా చేయడం వలన పెరుగులో ఉన్న లక్షణాలు కాకరకాయ చేదును తగ్గిస్తాయి.
కాకరకాయ కూర ఉడికిన తర్వాత చివరిలో నిమ్మరసం కలిపితే కాకరకాయ చేదు తగ్గడమే కాకుండా కూర చాలా రుచిగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే పులుపు కాకర చేదును తగ్గించడానికి సహాయపడుతుంది.
కాకరకాయ పై తొక్క ఎక్కువ చేదును కలిగి ఉంటుంది. దాంతో ముందుగా పై పొట్టును తొలగించాలి. అయితే మనలో చాలామంది తొక్కతో పాటు కాకరకాయను తింటూ ఉంటారు. ఇలా పై పొట్టు తీసేస్తే చేదు తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Tags:
Bitter gourd |Kitchen Hacks|Cooking Tips|Bitter Gourd Benefits|Bitter Gourd Cooking Tips

