Kitchenvantalu

పురుగులు పట్టకుండా డ్రైఫ్రూట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!

How to Store Nuts and Dried Fruits in telugu:డ్రైఫ్రూట్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే…ఈ టిప్స్ ఫాలో అవ్వండి..మనం ఆరోగ్యం కోసం ఎంతో ఇష్టంగా బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి డ్రైఫ్రూట్స్ తెచ్చుకుంటాం. కానీ, వాటిని సరిగ్గా భద్రపరచకపోతే త్వరగా మెత్తబడిపోతాయి లేదా పురుగులు పడతాయి. ఖరీదైన డ్రైఫ్రూట్స్ అలా పాడైపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా!

అందుకే మీ డ్రైఫ్రూట్స్ ఎన్నాళ్లయినా వాటి రుచి, తాజాదనం కోల్పోకుండా ఉండటానికి కొన్ని బెస్ట్ మరియు సులభమైన స్టోరేజ్ చిట్కాలను మీకోసం తీసుకొచ్చాము

ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మనలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకున్నారు. అయితే ఒక్కోసారి తక్కువ ధరకు వచ్చాయని ఎక్కువ మొత్తంలో డ్రైఫ్రూట్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. వాటిని నిల్వ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం.

Dry Fruits కొనుగోలు చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో డ్రై ఫ్రూట్స్‌ను ఉంచండి. దీనితో అవి ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి పైగా ఇలా ఎయిర్ టైట్ వాటి‌లో పెట్టడం వల్ల చీమలు వంటివి రావు. వీటిని ఎప్పుడూ కూడా చల్లని మరియు పొడి ప్రదేశంలో ఉంచకూడదు. అలాగే డైరెక్ట్ సూర్య కిరణాలు తగిలేలా పెట్టారంటే అవి త్వరగా పాడైపోతాయి.

అందుకని వీలైనంత వరకూ చల్లటి మరియు పొడి ప్రదేశంలో ఉంచండి. అప్పుడు Dry Fruits ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. లేదంటే త్వరగా పాడై పోతాయి. ఓవెన్‌లో నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు టోస్ట్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఓవెన్ లేనివారు పాన్‌లో కూడా ఫ్రై చేయొచ్చు.

చాలా మంది స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలలో పెడుతూ ఉంటారు. కానీ బెటర్ ఆప్షన్ ఏమిటంటే గాజు సీసాలు. గాజు సీసాలో డ్రై ఫ్రూట్స్‌ని పెడితే ఎక్కువ కాలం పాడై పోకుండా ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి డ్రైఫ్రూట్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చూసుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."