రుచికరమైన ఆంధ్రా కరివేపాకు పచ్చడి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Karivepaku Nilva pacchadi Recipe:రుచికరమైన ఆంధ్రా కరివేపాకు పచ్చడి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. కంటికి మేలు చేసే కరివేపాకు తాలింపు లోకే సరిపెడతారు.అది కూడ తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు.
అలా కాకుండా పక్కన పెట్టే చాన్స్ లేకుండా కరివేపాకుతో పచ్చడి చేసేయండి.మనం సాధారణంగా కూరల్లో కరివేపాకును సువాసన కోసం వాడి, తినేటప్పుడు పక్కన పెట్టేస్తుంటాం. కానీ కరివేపాకులో ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇలాంటి ఆరోగ్యకరమైన కరివేపాకును అందరూ ఇష్టంగా తినాలంటే ఇలా ‘నిల్వ పచ్చడి’ చేసి చూడండి. అచ్చమైన ఆంధ్రా పద్ధతిలో చేసే ఈ పచ్చడి నెలల తరబడి నిల్వ ఉంటుంది. టిఫిన్స్ లోకి, అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

కావాల్సిన పధార్ధాలు
కరివేపాకు- 50 గ్రాములు
చింతపండు – 80-100 గ్రాములు
పచ్చిమిర్చి- 100 గ్రాములు
ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్
నూనె- ¼ కప్పు
ఆవాలు – 1 టీస్పూన్
మెంతులు -1/4 టీ స్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
మినపపప్పు- 1 టేబుల్ స్పూన్
శెనగ పప్పు- 1 టేబుల్ స్పూన్
ధనియాలు- 2 టీస్పూన్
వెల్లుల్లి- 10
పసుపు- ½ టీ స్పూన్
తయారి విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి చేసి అందులో ఆవాలు,మెంతులు వేసి దోరగా వేపుకోవాలి.
2.తర్వాత అందులోకి శెనగపప్పు,మినపపప్పు వేసి రంగు మారే వరకు వేపుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి వెల్లుల్లి ,జీలకర్ర పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి.
4.మగ్గిన పచ్చిమిర్చిలో తడిలేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసి తడి పోయే వరకు వేపుకోవాలి.
5.వేగిన పధార్ధాలను మిక్సి జార్ లో వేసుకోని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు అదే కడాయిలో చిక్కని చింతపండు గుజ్జు బెల్లం వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
7.చిక్కని చింతపండు పేస్ట్ లోకి ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడి లో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి.
8.అంతే కమ్మటి కరివేపాకు రెడి అయినట్టే.

