Beauty TipsHealthhealth tips in telugu

వింటర్ స్కిన్ కేర్: ఖరీదైన క్రీమ్స్ వద్దు.. ఈ న్యాచురల్ టిప్స్‌తో చలిలోనూ మీ చర్మం కాంతివంతంగా..!

Black Sesame seeds face glow:చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పగిలిపోయి, డ్రైగా మారిపోయి ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా! ఆ డ్రైనేస్ తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే క్రీమ్స్ అన్నీ వాడేస్తుంటాం. కానీ వాటివల్ల అప్పటికప్పుడు సాఫ్ట్ గా అనిపించినా, కాసేపటికి మళ్లీ మామూలే.

అసలు ఎలాంటి రసాయనాలు వాడకుండా, మన ఇంట్లో దొరికే సింపుల్ వస్తువులతో ఈ చలికాలంలో మన స్కిన్ ని కాంతివంతంగా ఎలా ఉంచుకోవాలో ఈ బ్లాగ్ లో రాశాను. ఒకసారి ఈ టిప్స్ ట్రై చేసి చూడండి, మీ స్కిన్ ఎంత మృదువుగా మారుతుందో మీకే అర్థమవుతుంది!

మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా ఉండదు. అలాగే ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతుంది.

దీని కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా పెద్దగా పలితం రాక నిరాశ పడతారు. ఒక వేల పలితం వచ్చినా తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.

ఈ సమస్యకు ఇంటిలోనే మంచి పరిష్కారం ఉంది. వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఒక స్పూన్ నల్ల నువ్వులను మెత్తని పొడిగా చేసుకోవాలి.

ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ నువ్వుల పొడి,పావు స్పూన్ పసుపు వేసి కొంచెం నీటిని పోసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని మంగు మచ్చలు,నలుపు,తెలుపు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నల్ల నువ్వులలో ఉండే లక్షణాలు మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు మచ్చలను తొలగించి చర్మం ఆరోగ్యంగా అందంగా తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఈ మచ్చలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."