ప్రతి ఇల్లాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైన కిచెన్ టిప్స్!
Kitchen Tips in telugu:ఉదయం లేవగానే హడావిడి, వంటగదిలో గంటల తరబడి నిలబడి కష్టపడటం.. ప్రతి ఇంట్లో రోజూ ఉండే పనే కదా! అయితే కొన్ని స్మార్ట్ చిట్కాలు తెలిస్తే ఆ శ్రమను సగానికి సగం తగ్గించుకోవచ్చు.
మీ సమయాన్ని ఆదా చేస్తూ, వంటను మరింత రుచిగా మార్చే కొన్ని అద్భుతమైన కిచెన్ టిప్స్ ఈ బ్లాగ్‌లో మీకోసం తీసుకొచ్చాను. ఇవి ఫాలో అయితే వంట చేయడం ఇక ఏమాత్రం భారం కాదు.. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది!
వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే సమయం ఆదా అవ్వటమే కాకుండా వంటలో పోషకాలు అన్ని అలానే ఉండి మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా వుంటే చారెడు ఉప్పు వేసి పది నిమిషాలు నానబెడితే మట్టి గడ్డలు నీళ్ళలో కరిగి పోతాయి.
కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి ఆ తరువాత ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కడిగితే పోషకాలు పోతాయి.
కూరగాయ ముక్కల్ని పసుపు కలిపిన నీటిలో వుంచితే ఏమైనా క్రిములు వుంటే అవి పైకి తేలిపోతాయి.
నిమ్మకాయల్ని నేలమీద పెట్టి అరచేత్తో అదిమి అటు ఇటు త్రిప్పి ఆతర్వాత కోస్తే రసం కొంచెం ఎక్కువగా వస్తుంది. ఫ్రిజ్ లోంచి తీసిన నిమ్మకాయ గది ఉష్ణోగ్రతకి చేరిన తర్వాతనే కోయాలి. లేకుంటే రసం తక్కువగా వస్తుంది.
పగిలిన గ్రుడ్డును కొంచెం వెనగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితే లోపలి ద్రవం బయటికి రాకుండా బాగా ఉడుకుతుంది. గ్రుడ్లను ఉప్పు నీటిలో ఉడక బెట్టి వెంటనే చన్నీళ్ళలో ఉంచితే పై పెంకు ఒలవడం తేలికవుతుంది. కోడిగ్రుడ్డును అల్యూమినియం లేదా వెండి పాత్రలలో పగులగొడితే అందులోని సల్ఫర్ కారణంగా పాత్రలు నల్లబడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

