Healthhealth tips in telugu

తమలపాకు + వాము: ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే దివ్యౌషధం!

Betel leaf with ajwain health benefits In Telugu : భారీగా భోజనం చేసిన తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపించడం మనలో చాలామందికి ఎదురయ్యే సమస్యే. అయితే, ఎప్పుడైనా తమలపాకులో కాస్త వాము వేసుకుని నమిలి చూశారా? మన నానమ్మలు, అమ్మమ్మల కాలం నాటి ఈ చిన్న ఇంటి చిట్కా వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.

అసలు ఈ కాంబినేషన్ మన శరీరానికి ఎలా మేలు చేస్తుంది? గ్యాస్ ట్రబుల్ నుండి జలుబు దాకా ఎన్నో సమస్యలను ఇట్టే మాయం చేసే ఈ అద్భుతమైన న్యాచురల్ రెమెడీ గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం.

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఏదొక సమస్యతో బాధపడుతున్నారు. చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. తమలపాకు,వాము రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
tamalapaku
ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, సరైన సమయంలో భోజనం చేయక పోవటం, కాఫీ,టీలు ఎక్కువగా తాగటం,జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వంటి కారణాలతో కడుపు ఉబ్బరం,గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అధిక బరువు, శరీరంలో అదనంగా కొవ్వు పెరుకుంటుంది.

ఈ సమస్యలను తగ్గించుకోవటానికి చిట్కా తెలుసుకుందాం. ఒక తమలపాకులో పావు స్పూన్ వాము వేసి చుట్టి నోట్లో పెట్టుకొని నములుతూ ఆ రసాన్ని మింగాలి. ఈ విధంగా రోజులో ఒకసారి చేస్తే సరిపోతుంది. తమలపాకు,వాము కలిపి తినటం వలన జీవక్రియ పెరగటమే కాకుండా గ్యాస్,కడుపు ఉబ్బరం వంటివి తగ్గుతాయి.

ఈ మిశ్రమం లాలాజలం ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మీ జీర్ణవ్యవస్థ పనితీరును మరింత బలోపేతం చేస్తుంది. మీ కడుపు యొక్క పెరిస్టాల్టిక్ కదలికను మెరుగుపరుస్తుంది, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతుంది. అంతేకాకుండా అధిక బరువు, శరీరంలో పెరుకున్న కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."