బ్యూటీ పార్లర్ కి వెళ్లే టైమ్ లేదా? అయితే ఇంట్లోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి!
Milk and Corn flour Face Glow Tips In Telugu : ఆఫీస్ పనులు, ఇంటి పనులతో బిజీగా ఉండి బ్యూటీ పార్లర్‌కి వెళ్లే టైమ్ దొరకట్లేదా? ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీకి వెళ్లాలి కానీ ముఖం డల్‌గా ఉందని ఫీల్ అవుతున్నారా? అయితే మీ కోసమే ఈ సింపుల్ అండ్ సూపర్ టిప్.
మన ఇంట్లో ఉండే వస్తువులతోనే కేవలం కొన్ని నిమిషాల్లో పార్లర్‌కి వెళ్లినంత గ్లో ఎలా తెచ్చుకోవచ్చో ఈ పోస్ట్‌లో క్లియర్‌గా చెప్పాను. పెద్దగా ఖర్చు లేకుండా మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చే ఆ మ్యాజిక్ రెమెడీ ఏంటో చూసేయండి!
ముఖం అందంగా ఉండాలంటే ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. కాస్త ఓపికగా ఇంటిలో ఉన్న వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది.
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అందం మీద శ్రద్ద బాగా పెరిగింది. ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు,మురికి వంటివి లేకుండా ముఖం తెల్లగా కాంతి వంతంగా మెరవాలంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్థాలతో చాలా సులభంగా అందమైన కాంతివంతమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఒక గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పొడి, 4 స్పూన్ల పచ్చిపాలు వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. పాలల్లో కాఫీ పొడి., కార్న్ ఫ్లోర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే ఒక పేస్ట్ లా తయారవుతుంది. .
ఈ పేస్ట్ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే మూడు రోజులు వరకు నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ ని ముఖం మీద రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద జిడ్డు, మురికి, నలుపు, మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.
కాఫీలో ఉండే కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహాయపడుతుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా మృదువుగా మంచి కాంతితో మెరుస్తూ ఉంటుంది. కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి స్కిన్ కూడా హెల్దీ గా ఉంటుంది. కాఫీ పొడి చాలా సులువుగా అందుబారులో ఉంటుంది.
కార్న్ ఫ్లోర్ ముఖం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఈ ప్యాక్ తయారుచేసుకొని వాడి మచ్చలు లేకుండా తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండీ.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

