Kitchenvantalu

వంకాయ కూర ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈసారి మిరియాలతో ఇలా ఘాటుగా ట్రై చేయండి!

Pepper Brinjal Curry: వంకాయ కూర అనగానే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు కదూ! అయితే ఎప్పుడూ చేసుకునే పాత పద్ధతిలో కాకుండా.. ఈసారి కాస్త కొత్తగా, ఘాటుగా మిరియాలు దట్టించి వంకాయ కూర వండి చూడండి.

వేడి వేడి అన్నంలో ఈ మిరియాల వంకాయ కూర కలుపుకుని తింటుంటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే. వంకాయ అంటే పెద్దగా ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుని మరీ తింటారు. ఇంట్లో వాళ్లందరినీ మెప్పించే ఈ స్పైసీ అండ్ టేస్టీ ‘మిరియాల వంకాయ కూర’ ఎలా చేయాలో ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం రండి!

వంకాయ కర్రీ ఎలా చేసినా ఇష్టంగా తింటుంటారు.మిర్యాల పొడితో వంకాయలు జోడించారంటే టేస్ట్ డబుల్ అవుతుంది.ఈసారి ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
వంకాయలు -1/4 kg
టమాటో – 3
కారం – 1 టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – 1 టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
పసుపు -1/2 టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 ½ టీ స్పూన్
ఉల్లిపాయలు – 2

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిల్ వేసి అందలోకి జీలకర్ర,పచ్చిమిర్చి ,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉల్లిపాయలు,టమాలు వేసి వేపుకోవాలి.
2.టమాటోలు మెత్తపడ్డాక అందులోకి కారం ,ధనియాల పొడి ,ఉప్పు వేసి కలుపుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి వంకాయ ముక్కలను వేసి కలిపి మూతపెట్టి లోఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి కప్పు నీళ్లను పోసి పెప్పర్ పొడి వేసి బాగా కలుపుకోని కొత్తీమీర తరుగవేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.అంతే స్పైసీ స్పైసీ వంకాయ పెప్పర్ కర్రీ రెడీ.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."