ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? ఒక్క ఎలుక కూడా ఇంట్లోకి రాకుండా చేసే అద్భుత చిట్కా!
How do i get rid of rats :ఇంట్లో ఎలుకలు చేస్తున్న రచ్చతో విసిగిపోయారా? రాత్రి పూట కిచెన్ లో వాటి పరుగులు, బట్టలు, ముఖ్యమైన వైర్లు కొరికేయడం.. అబ్బో ఈ బాధ వర్ణనాతీతం కదూ! వాటిని చంపడానికి మందులు పెడితే.. అవి ఎక్కడో మూలన పడి చచ్చిపోయి ఆ దుర్వాసన భరించడం మరో పెద్ద తలనొప్పి.
మరి ఎలుకలను చంపకుండా, ఇంటి నుంచి శాశ్వతంగా ఎలా తరిమికొట్టాలి? దీనికోసం బయట దొరికే కెమికల్స్ కాకుండా మన ఇంట్లో ఉండే కొన్ని సింపుల్ వస్తువులతోనే ఎలుకలను పారద్రోలే అద్భుతమైన నాచురల్ చిట్కాలు ఉన్నాయి. అవేంటో, వాటిని ఎలా వాడాలో ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం రండి!

ఎలుకలకు లవంగాల వాసన పడదు. అందువల్ల కొన్ని లవంగాలను ఒక వస్త్రంలో వేసి మూట కట్టి ఎలుకలు తిరిగే ప్రాంతాలలో పెడితే ఆ వాసనకు ఎలుకలు బయటకు పారిపోతాయి.
పెప్పర్‌మింట్ ఆయిల్ లో ముంచిన దూది బాల్స్ ని ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెడితే ఆ వాసనకు ఎలుకలు బయటకు పారిపోతాయి.
మనం ప్రతి రోజు వంటలలో కారం వాడతాము కదా… ఆ కారం పొడిని ఒక వస్త్రంలో వేసి మూట కట్టి ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెడితే ఎలుకలు పారిపోతాయి.
ఉల్లి వాసన కూడా ఎలుకలకు పడదు. ఉల్లిపాయ ముక్కలను గదికి నాలుగు మూలాల పెడితే ఆ వాసనకు ఎలుకలు రావు. 2 రోజులకు ఒకసారి ఉల్లిపాయ ముక్కలను మార్చాలి.
మార్కెట్లో ఎలుకల మందు దొరుకుతుంది. పెస్ట్ కంట్రోల్ మందులు కూడా స్ప్రే చేయవచ్చు. ఐతే ఇవన్నీ హానికారక రసాయనాలు. వాటితో మన ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదముంది. అదే ఇంట్లో దొరికే సహజసిద్ధమై పదార్థాలతో ఎలుకలను తరిమి కొడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ చిట్కాలను పాటించి ఎలుకలను ఇంటి నుంచి తరిమికొట్టండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

