Beauty TipsHealthhealth tips in telugu

అవిసె గింజల మ్యాజిక్: ఇలా వాడితే ఊడిన జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది!

Flaxseed Gel And Rice Water For Hair:తలస్నానం చేసినప్పుడల్లా జుట్టు రాలిపోతోందని భయపడుతున్నారా? దువ్వెన నిండా రాలిన జుట్టు చూసి బాధగా అనిపిస్తోందా? మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, ఖరీదైన నూనెలు వాడి విసిగిపోయి ఉంటే… ఒక్కసారి ఈ సింపుల్ ఇంటి చిట్కాను ట్రై చేసి చూడండి.

మనకు చాలా తక్కువ ధరకు దొరికే ‘అవిసె గింజలు’ (Flaxseeds) జుట్టుకి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని సరైన పద్ధతిలో వాడితే, జుట్టు రాలడం తగ్గడమే కాకుండా.. ఊడిన చోటే కొత్త జుట్టు రెట్టింపు ఒత్తుగా పెరుగుతుంది. ఇంతకీ అవిసె గింజలతో ఆ మ్యాజిక్ జెల్ ఎలా తయారు చేయాలి? దాన్ని జుట్టుకు ఎలా రాసుకోవాలో ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం రండి

మారిన జీవనశైలి పరిస్థితులు, ఒత్తిడి, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం, కెమికల్స్ ఎక్కువగా ఉండే నూనెలు, షాంపూలు ఎక్కువగా వాడటం వలన జుట్టు రాలే సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది. ఇప్పుడు జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి, జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. ఈ రెమిడీ కోసం ఆవిసే గింజలు, బియ్యంలను ఉపయోగిస్తున్నాం.

ఒక గిన్నెలో 2 స్పూన్ల బియ్యం, 2 స్పూన్ల ఆవిసే గింజలను, గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి 7 నుంచి 9 నిమిషాలు మరిగించాలి. అప్పుడే బియ్యం, ఆవిసే గింజలలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి జుట్టుకి పట్టించాలి. గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం, ఆవిసే గింజలలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా అడ్డుకుంటాయి. దాంతో జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."