Beauty TipsHealthhealth tips in telugu

White Hair Magic: ఇకపై తలపై ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు.. 100% న్యాచురల్ రిజల్ట్!

White Hair tips in telugu : నమస్కారం అండి! ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ‘తెల్ల జుట్టు’ (Premature Greying). చిన్న వయసులోనే తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తుంటే, అది చూసుకుని ఎంతగానో బాధపడుతుంటాం.

వాటిని కవర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ హెయిర్ డైలు వాడి, ఉన్న జుట్టును కాస్తా పాడుచేసుకుంటున్నాం కదా! కానీ, ఎలాంటి కెమికల్స్ వాడకుండా.. మన ఇంట్లో దొరికే సహజమైన వస్తువులతోనే తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చని మీకు తెలుసా?

ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ తలపై ఇక ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. ఆ మ్యాజిక్ రెమెడీ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం రండి!

మారిన పరిస్థితి, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య ఎక్కువగా వస్తుంది.

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే చాలామందికి తెల్ల జుట్టు సమస్య అనేది వచ్చేస్తుంది. తెల్ల జుట్టు సమస్య రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఒక గిన్నెలో గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టాలి దీనిలో రెండు స్పూన్ల టీ పొడి వేసి డికాషన్ వచ్చే వరకు మరిగించాలి అందులో ఒక స్పూన్ కలోంజి పౌడర్ ఒక స్పూన్ ఉసిరికాయ పౌడర్ ఒక స్పూన్ ఎర్రమందారం పౌడర్, 6 స్పూన్ల బృంగ్రాజ్ పౌడర్ వేసి బాగా కలిపి కొంచెం సేపు మరిగించాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టును పాయలుగా విడదీసి జుట్టు అంతా పట్టేలా గా పట్టించాలి ఆ తర్వాత వెనక్కి దువ్వుకుని ఈ మిశ్రమం అంతా జుట్టుకు బాగా పడుతుంది. అరగంటయ్యాక తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపు ఉపయోగించి తలస్నానం చేయాలి.

ఈ చిట్కా కోసం ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి సహాయపడతాయి అంతేకాకుండా జుట్టు కుదుళ్లకు కావలసిన పోషణను అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."