Beauty TipsHealthhealth tips in telugu

60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యవ్వనం.. ఈ నూనె వాడితే ముఖంపై ముడతలు మాయం!

wrinkles Home Remedies in Telugu : చర్మంపై ముడతలు వచ్చాయంటే మనలో చాలా మంది కంగారు పడి ముడతలను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

అదే చిన్న వయస్సులో ముడతలు వస్తే వారి బాధను మాటల్లో చెప్పలేము. ముడతలు రావటానికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన లోషన్స్,క్రీమ్స్ వాడుతూ ఉంటారు.
Wrinkles remove Tips In Telugu
అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. 20 బిర్యానీ ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత 10 యాలకులను వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి కాస్త వేడి అయ్యాక బిరియాని,యాలకుల పొడి వేసి పది నిమిషాలు మరిగించాలి.

ఆ తర్వాత చల్లారాక ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ముఖానికి,మెడకు రాసి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే ముడతలు క్రమంగా తగ్గుతాయి.

బిరియాని ఆకు, యాలకుల్లో ఉన్న పోషకాలు చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేసి ముడతలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముడతలను తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."