Healthhealth tips in telugu

రోజుకు ఒక్క లడ్డు చాలు.. కీళ్లనొప్పులు, రక్తహీనత, నీరసం మాయం!

Dry Fruit Laddu : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరికే ఉండటం లేదు కదూ! అందుకే చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఏ చిన్న పని చేసినా విపరీతమైన అలసట, నీరసం వస్తున్నాయి. అంతేకాదు, రక్తహీనత, బరువు పెరగడం లాంటి సమస్యలు మనల్ని తెగ ఇబ్బంది పెడుతున్నాయి.

వీటన్నింటికీ చెక్ పెట్టడానికి ఒక అద్భుతమైన, రుచికరమైన పరిష్కారంతో మీ ముందుకు వచ్చాను. అదే ఈ ‘హెల్తీ లడ్డు’. రోజూ ఉదయాన్నే ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు.. రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. మరి ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ లడ్డుని ఎలా తయారు చేయాలో, దానికి ఏమేం కావాలో ఈ పోస్ట్‌లో చూసేద్దామా!

శరీరంలో క్యాల్షియం లేకపోవడం, శారీరకంగా బలహీనంగా ఉండటం, శరీరంలో తగినంత రక్తం లేక రక్తహీనత సమస్య తో ఉండటం, థైరాయిడ్ సమస్య ఉండటం, ఎముకలు బలహీనంగా ఉండటం, అలాగే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండటం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
Health Benefits of Dates
మనం ఈరోజు ఒక లడ్డు తయారు చేసుకుంటున్నాం. రోజుకి ఒక గ్లాసు పాలు, ఒక లడ్డు తింటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ లడ్డు ఎలా తయారు చేయాలి ఈ లడ్డూ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి వివరంగా తెలుసుకుందాం. ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేయించి పొట్టు తీసి రఫ్ గా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి.

ఒక కప్పు ఖర్జూరం తీసుకొని గింజలు తీసి ముక్కలుగా కట్ చేయాలి. ఖర్జూరం గట్టిగా ఉంటే వేడి నీరు పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. మిక్సీ జార్ లో ఖర్జూరం ముక్కలు, వేరుశనగ పొడి రెండు స్పూన్స్, ఒక స్పూన్ కోకో పొడి వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని మిగిలిన వేరుశనగ పొడి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. ఈ లడ్డులను రోజుకి ఒకటి తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గటమే కాకుండా అలసట,నీరసం, నిసత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. 15 రోజుల పాటు ప్రతి రోజు ఒక లడ్డు తింటే ఆ తేడా మీకే కనిపిస్తుంది. ఈ లడ్డును ఏ సమయంలోనైనా తినవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."