ఎలాంటి డై వాడకుండా 15 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారే అద్భుతమైన చిట్కా!
White Hair Turn Black:చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందని బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే కెమికల్ డైలు వాడితే ఉన్న జుట్టు కూడా రాలిపోతుందనే భయం వేధిస్తోందా? మీ టెన్షన్ నాకు అర్థమైంది! అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, మన ఇంట్లోనే సులువుగా చేసుకోగలిగే ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను.
నేను చెప్పే ఈ చిన్న చిట్కాను కేవలం 15 రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే చాలు.. మీ తెల్ల జుట్టు న్యాచురల్ గా నల్లగా, ఆరోగ్యంగా మారడం మీరే గమనిస్తారు. మరి ఆ మ్యాజిక్ రెమెడీ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ బ్లాగ్‌లో వివరంగా చూసేద్దాం రండి!
మనలో చాలా మంది చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల జుట్టు సమస్య రాగానే చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వాటిలో రసాయనాల కారణంగా జుట్టు రాలే ప్రమాదం ఉంది.

కాబట్టి మన ఇంటిలో సహజ సిద్ధంగా తయారు చేసుకున్న నూనె ఉపయోగిస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఒక గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నూనె, ఐదు పచ్చి ఉసిరికాయ ముక్కలు, రెండు మందార పువ్వులు, పావు కప్పు గోరింటాకు, రెండు స్పూన్ల కలోంజి సీడ్స్ వేసి బాగా ఉడికించాలి. ఈ నూనె నల్లగా మారిన తర్వాత ఒక సీసాలో పోసుకుని నిలువ చేసుకోవాలి.
ఈ నూనెను వారంలో రెండుసార్లు తలకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కాబట్టి ఈ నూనెను వాడటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

