Beauty TipsHealthhealth tips in telugu

పసుపు పచ్చని పళ్లు నిమిషంలో తెల్లగా మారాలా? ఉప్పుతో ఈ మ్యాజిక్ చేయండి!

Home remedies for white teeth and bad breath : నలుగురిలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వాలంటే పసుపు పచ్చని పళ్లు అడ్డంకిగా మారుతున్నాయా? పంటి మీద గార పట్టి బ్రష్ చేసినా వదలట్లేదా? అయితే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు.

డెంటిస్ట్ దగ్గరకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా, మన ఇంట్లో ఉండే ఉప్పుతో కేవలం ఒక్క నిమిషంలో పసుపు పళ్లను ముత్యాల్లా మెరిపించవచ్చు. అది ఎలాగో, ఆ సింపుల్ ట్రిక్ ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా చూసేయండి.

పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది. చాలా.మంది పళ్ళు గార పట్టి పసుపు రంగులో మారి ఉంటాయి. అంతేకాకుండా మరికొంతమందికి చిగుళ్ల వాపు వస్తుంది. అలాగే నోటి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. .
Yellow teeth tips
మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రెమిడీ కోసం ఆవనూనె,ఉప్పు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇవి క్లెన్సర్‌గా పనిచేస్తాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన, పసుపు రంగు, దంత క్షయం, రక్తస్రావం మరియు చిగుళ్ళ వాపు వంటి తీవ్రమైన సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఆవనూనె మరియు ఉప్పు అనేది చిగుళ్ళను శుభ్రం చేయడానికి మరియు దంతాల నుండి ఫలకాన్ని తొలగించడానికి పురాతన కాలం నుండి వాడుతున్న పద్దతి. ఉప్పు తేలికపాటి రాపిడిని కలిగించి పళ్ళు తెల్లగా మెరవటానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే ఫ్లోరైడ్ దంతాలు మరియు చిగుళ్ళను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఆవనూనె చిగుళ్లను బలోపేతం చేసి పళ్ల మీద పసుపు రంగును తొలగించటానికి సహాయపడుతుంది. అరస్పూన్ ఆవనూనెలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలు సాయంతో చిగుళ్ళు మరియు దంతాల మీద రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే క్రమంగా గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్ళు తెల్లగా మారతాయి.

గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని శ్రద్ద పెడితే సరిపోతుంది. ఇంటి చిట్కాలను పాటించి తెల్లని ముత్యాల్లాంటి పళ్లను సొంతం చేసుకొండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."