Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా పెరగాలా? ఈ నూనెను ఒక్కసారి ఇలా వాడి చూడండి!

Hair Fall and growth Oil : తల దువ్వుకున్నా, ఇల్లు ఊడ్చినా గుప్పెడు జుట్టు ఊడి వస్తుంటే వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎన్ని రకాల షాంపూలు, నూనెలు మార్చినా రిజల్ట్ ఉండట్లేదని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ టెన్షన్ వదిలేయండి.

మన ఇంట్లో ఉండే ఒక సాధారణ నూనెను సరైన పద్ధతిలో కనుక జుట్టుకు పట్టిస్తే.. హెయిర్ ఫాల్ వెంటనే ఆగిపోవడమే కాకుండా, జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇంతకీ ఆ నూనె ఏంటి? దాన్ని తలకు ఎలా అప్లై చేయాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా చూసేయండి.

జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే నూనెలు,షాంపూల మీద ఆధారపడి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

పొయ్యి మీద మూకుడు పెట్టి 100 ml కొబ్బరి నూనె పోయాలి. కొబ్బరి నూనెకి బదులు ఆవనూనె కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ kalonji seeds వేసి 10 నిమిషాలు మరిగించాలి.

బాగా మరిగిన ఈ నూనె కాస్త చల్లారాక వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయటం వలన రక్తప్రసరణ బాగా సాగి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నూనె రాశాక గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.

పగటి సమయంలో కుదరని వారు రాత్రి సమయంలో నూనెను జుట్టుకి రాసి మసాజ్ చేసి cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఇంటి చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ నూనెలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తాయి. అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులువుగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నూనెను వాడి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."