Kitchenvantalu

వేడి వేడి అన్నంలోకి అద్భుతమైన పల్లీ పచ్చడి: ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Peanut Chutney Recipe: ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా నోటికి ఏదైనా కమ్మగా, కాస్త ఘాటుగా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చేది పచ్చళ్ళే కదా! అందులోనూ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, కమ్మటి ‘పల్లీ పచ్చడి’ కలుపుకుని తింటే ఆ మజాయే వేరు.

పల్లీ పచ్చడి అనగానే చాలామంది కేవలం ఇడ్లీ, దోశల్లోకి మాత్రమే అనుకుంటారు. కానీ కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసి అన్నంలోకి సరిపోయేలా ఇలా పచ్చడి చేసి చూడండి..

ఇంట్లో వాళ్ళంతా కూరతో పనే లేకుండా ప్లేట్ మొత్తం ఇట్టే లాగించేస్తారు. నోరూరించే ఈ కమ్మటి పల్లీ పచ్చడిని నిమిషాల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. పల్లీ చట్నీని ఇలా చేస్తే అన్నంలోకి మరియు ఇడ్లీ, dosa వంటి వాటికీ కూడా చాలా బాగుంటుంది.

కావలసిన పదార్ధాలు
పల్లీలు – 1 కప్పు
ఎండుమిర్చి – 10
ఉప్పు – తగినంత
చింతపండు – ఉసిరికాయంత
ఉల్లిపాయ తరుగు – 1/2కప్పు
టమాటో ముక్కలు – 1
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
వెల్లుల్లి – 8
నూనె – 3 టేబుల్ స్పూన్స్

తయారి విధానం
1.కప్పు పల్లీలను సన్నని సెగ పై, వేయించుకుని, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేసి, అందులో ఎండుమిర్చి, వేపుకోవాలి.
3. వేగిన పల్లీలు, ఎండు మిర్చి, చింతపండు, కొద్దిగా నీళ్లు వేసుకుని, మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

4. ఇప్పుడు అదే బాండీలో, నూనె వేసి, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, వేసి వేగనివ్వాలి.
5. ఇప్పుడు అందులోకి టమాటో ముక్కలు వేసి, 2 నిముషాలు వేగిన తర్వాత,మిక్సీ జార్ లో వేసుకుని, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
6. మెదిగిన పచ్చడిలో ఆఖరుగా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలిపితే అదిరిపోతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."