Kitchenvantalu

బండి మీద దొరికే కరకరలాడే మసాలా వడలు ఇంట్లోనే.. ఈ సీక్రెట్‌తో చేసి చూడండి!

Crispy Masala Vada Recipe: సాయంత్రం చల్లగా గాలి వీస్తున్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు.. వేడివేడి టీ తాగుతూ ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుంది కదూ! అలాంటప్పుడు మనకు టక్కున గుర్తొచ్చేది రోడ్డు పక్కన బండి మీద అమ్మే వేడివేడి ‘మసాలా వడ’.

కానీ ఇంట్లో చేస్తే అవి మెత్తగా వస్తున్నాయా? లేక నూనె ఎక్కువగా పీల్చేస్తున్నాయా? అయితే ఈ పోస్ట్ మీకోసమే. పైన కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా..

అచ్చం స్ట్రీట్ స్టైల్‌లో ఉండే మసాలా వడలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఓ చిన్న ట్రిక్‌తో ఈ ఆర్టికల్‌లో మీతో పంచుకోబోతున్నాను. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయడం ఖాయం!”

సాయంత్రం అయిందంటే చాలు, చిరు తిండ్ల కోసం, టైమ్ పాస్ కోసం, స్నాక్స్ వెతుకుతూ ఉంటాం.శనగపప్పుతో, మసాలా వడలు చేసి, ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
పచ్చిశగనపప్పు – 1 కప్పు
ఉల్లిపాయ తరుగు – ½ కప్పు
పచ్చిమిర్చి తరుగు – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం తరుగు – 1 టీ స్పూన్
వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
సోయా కూర – 3 టేబుల్ స్పూన్స్ ( ఆప్షనల్)

తయారీ విధానం
1.శుభ్రంగా కడిగి 4 గంటలు నానపెట్టుకున్న, పచ్చిశగనపప్పును, ఒక పిడికెడు పక్కనపెట్టుకుని, మిగిలిన పప్పును వడకట్టుకోవాలి.
2. వడకట్టిన పప్పును, మిక్సీ జార్లోకి వేసుకుని, 2 చెంచాలు నీళ్లు వేసుకుని, బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3. గ్రైండ్ చేసుకున్న పప్పులోకి, పక్కనపెట్టిన శనగపప్పు, మిగిలిన పదార్ధాలు అన్ని వేసి, గట్టిగా, వత్తుతూ వడ పిండి కలుపుకోవాలి.

4. స్టవ్ పై కడాయి పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, వెడెక్కనివ్వాలి.
5. ఇప్పుడు చేతులు తడి చేసుకుని, కొద్దిగా పిండి తీసుకుని, చిన్న సైజ్ లో వడలు వత్తుకుని, నూనెలో వేసుకోవాలి.
6. మీడియం ఫ్లేమ్ పై రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేపుకోని తీసేసుకోవాలి.
7. అంతే మసాలా వడ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."