Healthhealth tips in telugu

అటుకులను ఇలా తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మాయం.. ఎలాగో తెలుసా?

Poha And Curd Benefits In telugu : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు. ఎన్ని మందులు వాడినా, ఆయింట్‌మెంట్లు రాసినా తాత్కాలిక ఉపశమనమే కానీ.. శాశ్వత పరిష్కారం దొరకడం లేదు కదూ!

అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన కిచెన్‌లో ఉండే ‘అటుకుల’తోనే ఈ నొప్పులకు చెక్ పెట్టొచ్చు. అటుకుల్లో ఆ ఒక్క పదార్థం కలిపి రోజూ తింటే.. కీళ్ల నొప్పులు మాయం అవ్వడమే కాదు, ఎముకలు ఉక్కులా బలంగా మారతాయి.

ఇంతకీ అటుకుల్లో ఏం కలపాలి? ఎలా తయారు చేసుకోవాలి? ఈ అద్భుతమైన చిట్కా వెనుకున్న అసలు నిజం ఏంటి? అనేది ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం రండి..

మోకాళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు నానమ్మ,అముమ్మలకు ఉండేవి. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరికి కీళ్ల నొప్పులు ఉంటున్నాయి. వీటికి ప్రధాన కారణం జీవనశైలి, తీసుకొనే ఆహారం,జంక్ ఫుడ్ తినటం,బోన్ కి అవసరమైన పోషణ లేకపోవటం.

కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవటం వలన కీళ్ల నొప్పులు వస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి.

మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. ఆ బాధ భరించటం చాలా కష్టం. ఆ బాధ భరించలేక చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి.

ఈ రోజు చెప్పే చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల అటుకులు, నాలుగు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేస్తే పెరుగులో అటుకులు నాని మెత్తగా అవుతాయి. పెరుగులో నానిన అటుకులను ప్రతి రోజు తినాలి. వీటిని ఏ సమయంలోనైనా తినవచ్చు.

పెరుగు,అటుకులు రెండింటిలోనూ కాల్షియం ఉండటం వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అటుకుల్లో పెరుగు కలిపి తినటం కష్టంగా ఉంటే కొంచెం తాలింపు పెట్టుకొని తినవచ్చు.

ప్రతి రోజు అటుకులు,పెరుగు కలిపి తింటే మీకు ఆ తేడా వారంరోజుల్లోనే కనపడుతుంది. పెరుగులో అటుకులు కలిపి దద్దోజనం లాగా తీసుకోవడం వల్ల కాల్షియం బాగా శరీరానికి అందేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."