Healthhealth tips in telugu

నెల రోజులు ఇది పాటిస్తే చాలు.. సైనస్, తలనొప్పి, అలసట జీవితంలో దరిచేరవు!

Sinus Pain Home Remedies : ఉదయం లేవగానే ముక్కులు బిడియపోవడం, భరించలేని తలనొప్పి, గొంతు నొప్పి.. వీటికి తోడు ఏ పని చేయలేనంత అలసట. సైనస్ సమస్య ఉన్నవారి బాధ అంతా ఇంతా కాదు. ఎన్ని మందులు వాడినా, రోజుకు ఎన్నిసార్లు ఆవిరి పట్టినా ఇది తాత్కాలిక ఉపశమనమే ఇస్తుంది తప్ప శాశ్వత పరిష్కారం చూపదు.

కానీ, కేవలం నెల రోజుల్లో ఈ సైనస్, ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటి సమస్యలన్నింటినీ పూర్తిగా తగ్గించి, జీవితంలో మళ్లీ మీ దరిచేరకుండా చేసే ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీ ఉంది. అదెంటో, ఎలా ఫాలో అవ్వాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం రండి.

సైనస్ సమస్య ఉంటే తరచుగా జలుబు, ముక్కు మూసుకుపోవడం వంటివి జరుగుతాయి. సైనస్ ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్సలే లేవు. సైనస్ అన్నవి ముక్కులో ఉండే చిన్నని కుహరములు. ముక్కు, గొంతుకకు మధ్య ఉంటాయి.
Diabetes patients eat almonds In Telugu
ఇవి గాలితో నిండి ఉంటాయి. శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ శ్లేష్మం ముక్కు రంధ్రాల్లోంచి వచ్చే అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలను అడ్డుకుంటుంది. నాసికా కుహరముల మధ్యనుండే కణజాలం వాచిపోవడాన్ని సైనసైటిస్ గా పేర్కొంటారు. కణజాలం వాచిపోవడంతో నాసికా కుహరములు బ్లాక్ అవుతాయి. దీంతో శ్లేష్మం, గాలి బంధించినట్టు అవుతుంది. దీనివల్ల నొప్పి, ఒత్తిడి కలుగుతుంది.

సైనస్ సమస్య చల్లని వాతారవరణం ఉన్నప్పుడు చాలాఎక్కువ అవుతుంది. సైనస్ సమస్య ఉన్నప్పుడు తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కులో నొప్పి, గొంతు నొప్పి, ముఖంలో వాపు, జ్వరం, అలసట, దగ్గు, ముక్కు కారడం, వాసన గ్రహించకపోవడం వంటి సమస్యలువస్తాయి. ఈ సమస్యకు ఇప్పుడు చెప్పే పాలను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

పొయ్యి మీద గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక మూడు బాదం పప్పులను తురిమి వేయాలి. ఆ తర్వాత 3 మిరియాలను క్రష్ చేసి వేయాలి.

ఆ తర్వాత చిన్న పటికబెల్లం ముక్కను వేసి 3 నిమిషాల పాటు మరిగించి తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే సైనస్, ముక్కు దిబ్బడ,తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."