Chili Cutting Tips: పచ్చిమిర్చి కట్ చేస్తే చేతులు మండుతున్నాయా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
Chili Cutting Tips: వంటగదిలో పచ్చిమిర్చి కట్ చేయడం అనేది ప్రతిరోజూ చేసే పనే. కానీ, మిర్చి కోసిన తర్వాత చేతులు విపరీతంగా మంట పుట్టడం మనందరికీ అనుభవమే! ఒక్కోసారి ఆ చేతులతో పొరపాటున కళ్ళు తుడుచుకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది.
అయితే, ఇకపై ఆ టెన్షన్ అస్సలు అవసరం లేదు. పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులు మంట మండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఒకవేళ మంట వస్తే వెంటనే తగ్గించుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన కిచెన్ చిట్కాలు (Kitchen Hacks) ఈ బ్లాగ్‌లో చూద్దాం!

పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు చేతులు మంట మండకుండా ఉండాలంటే ఈ టిప్స్.. మనం ప్రతిరోజు వంటలలో పచ్చి మిరపకాయలను వాడుతూ ఉంటాం. వంటలలో పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాడుతూ ఉంటాం. అలా పచ్చిమిర్చిని కోసిన తర్వాత చేతులు మండుతాయి. అలా మంట లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతులను శుభ్రంగా కడిగి కొంచెం అలోవెరా జెల్ రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే మంట నుండి ఉపశమనం కలుగుతుంది.
పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత చపాతీ పిండి వంటి వాటిని కలిపితే మంట నుండి ఉపశమనం కలుగుతుంది. పచ్చిమిర్చి కారణంగా వచ్చే చికాకు నుండి బయటపడవచ్చు.
పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతులకు ఆయిల్ రాసుకొని రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే మంట నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే చల్లని పెరుగును చేతులలో వేసుకొని రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే మంట నుండి ఉపశమనం కలుగుతుంది. పచ్చిమిర్చి కోసినప్పుడు మంట రాకుండా ఉండాలంటే చేతి తొడుగులు(gloves) ఉపయోగిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

