Beauty TipsHealthhealth tips in telugu

చేతులపై మెహందీ రంగు త్వరగా వదలట్లేదా? ఈ సింపుల్ చిట్కాలతో నిమిషాల్లో మాయం!

Mehndi Tips:పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో చేతులకు మెహందీ పెట్టుకోవడం ఎంత అందాన్నిస్తుందో… కొన్ని రోజుల తర్వాత ఆ రంగు వెలిసిపోయి చేతులు అందవిహీనంగా మారినప్పుడు అంతే చికాకు కలిగిస్తుంది.

ఆ సమయంలో మెహందీ రంగును త్వరగా తొలగించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చర్మం పొడిబారకుండా, సహజ సిద్ధమైన పద్ధతుల్లో మెహందీని సులభంగా ఎలా వదిలించుకోవాలో ఈ బ్లాగ్ పోస్ట్‌లో కొన్ని బెస్ట్ అండ్ సేఫ్ హోమ్ రెమెడీస్ ద్వారా వివరంగా తెలుసుకుందాం.

మెహందీ పెట్టుకున్నప్పుడు బానే ఉంటుంది. రాను రాను అది వెలసిపోయినట్లు మరకల్లా కనిపిస్తుంది. ఇది చూడ్డానికి అంతగా బాగోదు. అంతా త్వరగా ఇది చేతుల నుంచి పోదు కూడా. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మెహందీ మరకలు త్వరగా పోతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టూత్ ‌పేస్ట్‌లోనూ అద్భుత గుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల చాలా వరకూ మరకలు పోతాయి. పేస్ట్‌లో మెహందీ రంగును తొలగించే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మెహందీని పోగొట్టుకునేందుకు పేస్ట్‌ని తీసుకుని మెహందిపై పొరలా అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయండి. ఇలా చేస్తే ఆ మరకలు పోతాయి. కాబట్టిని పేస్ట్‌ని కూడా అప్లై చేసి మరకలను పోగొట్టుకోవచ్చు.

ఉప్పు కూడా మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల చాలా వరకూ మెహందీ మరకలు పోతాయి. ఇందు కోసం ఏం చేయాలంటే.. ఒక బౌల్‌లో కొద్దిగా నీరు తీసుకుని అందులో ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ నీటిలో చేతులు మునిగేలా ఉంచండి. 20 నిమిషాల తర్వాత బయటకి తీయండి.

ఇలా చేయడం వల్ల త్వరగా మెహందీ పోతుంది. కాళ్లకి ఉన్న మరకలు కూడా ఇలా చేయడం వల్ల పోతాయి. దీనికోసం ఓ టబ్‌లో ఉప్పునీటిని పోసి అందులో కాళ్లను పెట్టి ఆ తర్వాత రాయండి. ఇలా చేయడం వల్ల త్వరగా మెహందీ మరకలు పోతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."