మీరు వాడే పసుపు కల్తీదేమో? ఈ చిన్న ట్రిక్‌తో ఇంట్లోనే చెక్ చేసుకోండి!
Turmeric Powder: మన భారతీయ వంటకాల్లో, పూజా కార్యక్రమాల్లో పసుపుకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధంగా మనం రోజూ వాడే పసుపు నిజంగా స్వచ్ఛమైనదేనా? లేక కల్తీ రంగులమయమా? మార్కెట్లో దొరికే పసుపులో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతున్నారనే వార్తలు వింటుంటే భయం వేస్తుంది కదా!
అయితే కంగారు పడకండి. మనం ఇంట్లో వాడే పసుపు అసలుదా లేక నకిలీదా అనేది తెలుసుకోవడానికి ల్యాబ్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఒక చిన్న, సింపుల్ ట్రిక్ తో క్షణాల్లో చాలా ఈజీగా కనిపెట్టేయొచ్చు.
ఆ చిట్కా ఏంటో, పసుపులోని కల్తీని ఎలా గుర్తించాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం. చదివేసి మీ ఇంట్లోని పసుపును ఇప్పుడే చెక్ చేసుకోండి!
ప్రతి రోజు వాడే పసుపు అసలుదా..? నకిలీదా..? ఈ సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండి.. మనం ప్రతి రోజు వంటింటిలో పసుపు వాడుతూ ఉంటాం.
కూరల్లో పసుపు వేస్తే కూరకు రుచి రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పసుపును మార్కెట్ లో కొనకుండా పసుపు కొమ్ములను పొడిగా ఇంటిలోనే చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.
అయితే మనలో చాలా మంది పసుపును మార్కెట్ లో కొంటూ ఉంటారు. అలా మార్కెట్ లో కొన్నప్పుడు కల్తీ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే చిట్కాల ద్వారా పసుపు అసలుదా..? నకిలీదా..అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఒక బౌల్ లో పసుపు వేసి నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. దీనిలో కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తే…బుడగలు వస్తే సబ్బు పొడి లేదా సుద్ద పొడి కలిపినట్టు అర్ధం చేసుకోవాలి.
ఒక గ్లాసులో కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకుని దానిపై అర టీస్పూన్ పసుపు వేయండి. కదపకుండా అరగంట అలా ఉంచాలి. పసుపు పొడి అంతా గ్లాసు అడుగున స్థిరపడి, నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉంటే, పసుపు స్వచ్ఛమైనది. నీరు మబ్బుగా మారినట్లు అనిపిస్తే, అది కల్తీ అని అర్థం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

