Healthhealth tips in telugu

యాలకులతో ఇలా చేస్తే చాలు.. ఆస్తమా, శ్వాస సమస్యలు క్షణాల్లో మాయం.. ఊపిరితిత్తులు క్లీన్!

Health Benefits of Elaichi : వాతావరణంలో వచ్చే మార్పులు, దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం మరియు రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల నేడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది శ్వాసకోశ సమస్యలతో పాటు ఆస్తమా (Asthma) బారిన పడుతున్నారు.

చిన్నపాటి శ్రమకే ఆయాసం రావడం, రాత్రిపూట దగ్గు పెరగడం, ఛాతీలో పిల్లికూతలు (Wheezing) రావడం వల్ల నిత్యం ఇన్‌హేలర్లు, నెబ్యులైజర్లపై ఆధారపడాల్సి వస్తుంది.

మన వంటింట్లో రోజూ వాడే సుగంధ ద్రవ్యం యాలకులలో (Elaichi) శ్వాసనాళాల వాపును తగ్గించే అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ మరియు బ్రాంకోడైలేటర్ గుణాలు ఉన్నాయి.

ఇవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మొండి కఫాన్ని కరిగించి, శ్వాస మార్గాలను తెరిచి గాలి సాఫీగా ఆడేలా చేస్తాయి. ఈ పోస్ట్‌లో యాలకులను ఏ రూపంలో తీసుకోవాలి, ఎప్పుడు వాడాలి మరియు ఆస్తమా నుంచి ఉపశమనం పొందే సహజ ఆయుర్వేద పద్ధతులను వివరంగా తెలుసుకుందాం.

ఆస్తమా ఒక్కసారి వచ్చిందంటే తగ్గటం చాలా కష్టం. చలికాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో ఊపిరి సరిగా ఆడక చాలా ఇబ్బంది పడిపోతు ఉంటారు. ఆస్తమా రావటానికి అనేక కారణాలు ఉన్నప్పటికి దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కామన్ గా ఉండే లక్షణాలు.
Best summer drink elaichi sharbat
ఈ వ్యాధి పూర్తిగా తగ్గదు. ఉపశమనం కోసం మాత్రమే మందులు ఉంటాయి. ఆస్తమా నియంత్రణలో ఉంచటానికి మన వంటింటిలో ఉండే యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. మసాలాలలో రారాణి అయిన యాలకుల్లో ఎన్నో ప్రయోజనలు ఉన్నాయి. ధర కాస్త ఎక్కువగా ఉన్నా దానికి తగ్గట్టుగానే ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

యాలకులను పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో పావు స్పూన్ యాలకుల పొడి,బెల్లం వేసుకొని తాగాలి. డయబెటిస్ ఉన్నవారు బెల్లం వేసుకోకూడదు. ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోలేక‌పోవ‌డం, దగ్గు, ఆయాసం వంటి ఆస్త‌మా ల‌క్ష‌ణాల‌కు దూరంగా ఉండొచ్చు.

వేడి వేడి అన్నంలో యాలకుల పొడి వేసుకొని రెండు ముద్దలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమా ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి రోజు డైట్ లో యాలకులను చేర్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఊపిరితిత్తులలో ఏర్పడే శ్లేష్మం టాక్సిన్స్ బయటకు పంపి శ్వాసకోశ మార్గాలు క్లియర్ గా ఉండేలా చేస్తుంది.

ఆస్తమా ఉన్నవారు ఈ చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటింటిలో ఉండే యాలకులు చాలా సమర్ధవంతంగా ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాలకులలో ఉండే సినియోల్ అనే క్రియాశీల పదార్ధం ఒక శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ మరియు యాంటిసెప్టిక్, ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ ని నిరోధించడంలో సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."