రోజూ 1 స్పూన్ ఈ నూనె రాస్తే చాలు.. 15 రోజుల్లో జుట్టు రాలడం ఆగి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది!
Hair Growth oil at home In Telugu :మారుతున్న వాతావరణం, కాలుష్యం, పోషకాహార లోపం మరియు రసాయన ప్రొడక్ట్స్ వాడకం వల్ల నేడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం (Hair Fall). తల దువ్వుకున్న ప్రతిసారీ కుచ్చులు కుచ్చులుగా జుట్టు రాలిపోతుంటే మానసిక ఆందోళన కలగడం సహజం. దీని కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన సీరమ్‌లు, షాంపూలు వాడినా ఆశించిన ఫలితం ఉండదు.
మన ఇంట్లో లభించే సహజ మూలికలతో తయారుచేసే ఈ ప్రత్యేక నూనెను కుదుళ్లకు పట్టిస్తే రక్తప్రసరణ మెరుగై, జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి. కేవలం 15 రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గి, కొత్త వెంట్రుకలు పెరిగి జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా మారుతుంది. ఈ పోస్ట్‌లో ఈ మ్యాజికల్ హెయిర్ ఆయిల్ తయారీ విధానం, తలకు ఎలా మసాజ్ చేసుకోవాలి మరియు వాడాల్సిన సరైన పద్ధతిని వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య కనపడుతుంది. జుట్టు రాలటం ప్రారంభం కాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలా కాకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెను వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీని కోసం కొబ్బరి నూనె లేదా ఆముదం నూనె ఏదైనా వాడవచ్చు. ఒక గిన్నె పెట్టి దానిలో 100 గ్రాముల కొబ్బరి నూనె వేసి దానిలో రెండు మందార పువ్వులను కింద తొడిమలు,పుప్పొడి కాడలను తీసేసి వెయ్యాలి.
నూనెలో మందార పూలు బాగా వేగే వరకూ మరిగించాలి. మందార పువ్వులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక నూనెను వడగట్టాలి. ఈ నూనెను మనం నార్మల్ గా రాసుకొనే నూనెకు బదులుగా ప్రతి రోజు రాసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు రాసుకుంటూ ఉంటే తలలో కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు వేగంగా పెరుగుతుంది.
అంతేకాకుండా తల మీద చర్మం మీద తగినంత తేమ ఉండి చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం అని చెప్పాలి. మందార పువ్వులను పురాతన కాలం నుండి జుట్టు సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ నూనెను రెగ్యులర్ గా రాసుకుంటూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది.
ఈ నూనె కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ నూనెను వాడి జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి. ఈ నూనెను అన్నీ వయస్సులవారు ఉపయోగించవచ్చు. మందార పువ్వులు అన్నీ సీజన్ లలోనూ చాలా విరివిగా లభ్యం అవుతాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ నూనెను తయారుచేసుకొని వాడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

