కేవలం 5 నిమిషాల్లో.. పసుపు పళ్ళు ముత్యాల్లా మెరవాలంటే ఇలా చేయండి!
How to whiten teeth at home : నలుగురిలో ఉన్నప్పుడు మనసారా నవ్వాలంటే ఇబ్బందిగా అనిపిస్తోందా? పళ్ళు పసుపు రంగులో ఉన్నాయనో, గార పట్టి ఉన్నాయనో నవ్వడాన్నే ఆపేస్తున్నారా? రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తున్నా పళ్ళ మీద ఆ పసుపుదనం పోవడం లేదా? అయితే ఇక అస్సలు బాధపడకండి.
డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే కేవలం 5 నిమిషాల్లో పళ్ళను ముత్యాల్లా ఎలా మెరిపించొచ్చో ఈ ఆర్టికల్‌లో మీతో పంచుకుంటున్నాను. ఈ సింపుల్ చిట్కాతో మీ నవ్వు మరింత అందంగా మారుతుంది.. ఒకసారి ట్రై చేసి చూడండి!

పళ్ళు అందంగా మెరిసేలా ఉండాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ట్రీట్ మెంట్ చేయించుకోవలసిన అవసరం లేదు. మన ఇంటి చిట్కాలతో సులభంగా గార పట్టిన, పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం టమోటా రసం తీసుకోవాలి. పళ్లను తెల్లగా మార్చటానికి అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ టమోటాలో ఉంటుంది.
ఒక బౌల్ లో మూడు స్పూన్ల టమోటా రసం, అరస్పూన్ తురిమిన అల్లం, రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమంను బ్రష్ సాయంతో పళ్లను తోమాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేయాలి. ఈ మిశ్రమంను ఫ్రిజ్ లో పెడితే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.నోటి ఆరోగ్యానికి మరియు దంతాలు తెల్లబడటానికి ఇది శక్తివంతమైన నివారణగా పనిచేస్తుంది. అల్లం చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది, పంటి నొప్పులను దూరం చేస్తుంది మరియు నోటి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
నోటి ఆరోగ్యానికి మరియు దంతాలను తెల్లగా మార్చటానికి అల్లంలో ఉండే రాఫినోస్ మరియు జింజెరాల్ సహాయపడతాయి. పంటి మీద ఫలకం ఏర్పడకుండా రక్షణ కోసం రాఫినోస్, దంతాలు మరియు చిగుళ్ల చుట్టూ బ్యాక్టీరియా ఏర్పడకుండా ఇన్ ఫెక్షన్ తో పోరాటం చేయటానికి జింజెరాల్ సహాయపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

