Kitchenvantalu

నోరూరించే మసాలా మాకరోనీ: ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Macaroni Masala Recipe:మసాలా మాకరోనీ.. పేరు వింటేనే నోరూరిపోతుంది కదూ! పాస్తాని మన ఇండియన్ స్టైల్ మసాలాలతో కలిపి చేస్తే వచ్చే ఆ రుచే వేరు. పిల్లల స్కూల్ బాక్స్ కోసమైనా, సాయంత్రం వేడి వేడిగా స్నాక్ లాగా తినడానికైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ఈ బ్లాగ్ పోస్ట్‌లో అతి సులువుగా, అద్భుతమైన రుచితో ఇంట్లోనే మసాలా మాకరోనీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం.

మసాలా మాకరోనీ.. దీని రుచి అమోఘం.. తింటే అసలు వదిలిపెట్టరు.. మాకరోనీ అనేది అనేక రకాలైన పాస్తా వంటకాల తయారీకి ఉపయోగిస్తారు.

కావలసిన పదార్దాలు :
మెకరొని: కప్పు
ఉల్లిపాయలు: మూడు
నూనె: మూడు టేబుల్‌స్పూన్లు
టొమాటోగుజ్జు: అరకప్పు
కారం: టీస్పూను
పసుపు: పావుటీస్పూను
అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను
జీడిపప్పు: 10
గసాలు: 2 టేబుల్‌స్పూన్లు
పెరుగు: అరకప్పు
కసూతిమెంతిపొడి: అరటీస్పూను
ఉప్పు: తగినంత
గరంమసాలా: అరటీస్పూను.

తయారి విదానం :
మెకరొనిని వేడినీటిలో వేసి ఉడికించి వార్చాలి. అందులో కొద్దిగా నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. ఉల్లిపాయను తరిగి ముద్దలా నూరాలి. గసాలు, జీడిపప్పు ముద్దగా నూరి ఉంచాలి. ఓ బాణలిలో ఉల్లిముద్దను వేసి బాగా వేయించాలి.

తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేయాలి. ఇప్పుడు టొమాటోగుజ్జును కొంచెంకొంచెంగా వేస్తూ వేయించాలి. తరవాత పెరుగు, జీడిపప్పుముద్ద వేసి బాగా వేయించాలి. అవసరమైతే కాసిని నీళ్లు పోసి బాగా ఉడికించాలి.

తరవాత అందులో మెకరొని వేసి 5 నిమిషాలు ఉడికించి మెంతిపొడి, గరంమసాలా చల్లి దించాలి. దీన్ని వేడివేడిగా చపాతీలోకి తింటే బాగుంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."