Beauty TipsHealthhealth tips in telugu

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా? అయితే ఈ చిన్న మార్పులు చేసి చూడండి!

How To Stop White Hair : అద్దంలో చూసుకున్నప్పుడు తలలో ఒక్క తెల్ల వెంట్రుక కనిపించినా మనకు తెలియని టెన్షన్ మొదలవుతుంది కదా! ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ‘జుట్టు తెల్లబడటం’. వెంటనే దాన్ని కవర్ చేసుకోవడానికి కెమికల్ డైలు, కలర్స్ వాడి మిగతా జుట్టును కూడా పాడుచేసుకుంటుంటాం.

కానీ, అసలు ఆ తెల్ల జుట్టును నాచురల్‌గా అక్కడే ఆపేయడం మన చేతుల్లోనే ఉందన్న నిజం మీకు తెలుసా? మన ఆహారపు అలవాట్లు, రోజువారీ చేసే చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటే చాలు.. తెల్ల జుట్టు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఈ ఆర్టికల్‌లో వివరంగా మీకోసం రాశాను. ఒకసారి చదివి చూడండి!

ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులో వచ్చేస్తుంది. దాంతో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే రకరకాల hair dye లు వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా ఉండే కొన్ని వస్తువులతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ చిట్కా కోసం ఉసిరి ముక్కలను తీసుకొని ఒక పాన్ లో వేసి పొయ్యి మీద పెట్టి సిమ్ లో 5 నిమిషాల పాటు వెగించాలి. వేగిన తర్వాత కొంచెం నీటిని పోసి ఉసిరి ముక్కలను బాగా ఉడికించాలి. ఉసిరి ముక్కలు ఉడకటానికి దాదాపుగా 7 నిమిషాల సమయం పడుతుంది. బాగా ఉడికిన ఉసిరి ముక్కలను రాత్రంతా అలా ఉంచేయాలి.

మరుసటి రోజు ఉదయం ఉడికిన ఉసిరి ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఉసిరి ముక్కల పేస్ట్ లో ఒక స్పూన్ గోరింట పొడి, అరస్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలిపి తలకు పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారికి తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."