Healthhealth tips in telugu

పిచ్చి మొక్క అని వదిలేస్తున్నారా? ఈ అడవి దోసకాయల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Adavi Dosa benefits in telugu : పల్లెటూళ్లలో పొలం గట్ల మీద, కంచెల మీద ఈ ‘అడవి దోసకాయలు’ మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. చిన్నప్పుడు వీటిని చూసి ఏదో పిచ్చి కాయలు అనుకుని వదిలేసి ఉంటాం. కానీ, మనం పనికిరావని తీసిపారేసిన ఈ కాయల్లో దాగున్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.

మన తాతయ్యలు, నానమ్మలు వీటిని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు న్యాచురల్ మెడిసిన్‌లా వాడేవారు. అసలు ఈ అడవి దోసకాయల వల్ల మన శరీరానికి కలిగే అద్భుతమైన లాభాలు ఏంటి? వీటిని ఎలా ఉపయోగించాలి? అనేది ఈ ఆర్టికల్‌లో మీకోసం వివరంగా రాశాను. ఒకసారి చదివి చూడండి, ఇకపై ఇవి ఎక్కడ కనిపించినా మీరు అస్సలు వదిలిపెట్టరు!

నూగు దోస లేదా ముగుముగు దోసకాయ అని పిలిచే ఈ మొక్కలో ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. చిన్నతనంలో పిల్లలు సెలవు రోజు వస్తే ఈ కాయలను సేకరించి తినడానికి ఇష్టపడే వారు.

చేదు రుచి కలిగిన ఈ కాయలు చూడటానికి దోసకాయలు వలే అనిపిస్తాయి ఈ కాయలు మలబద్ధకం, గ్యాస్ సమస్య, అజీర్ణం, ఆకలి లేకపోవటం, ఆందోళన,ఉబ్బసం, పొడి దగ్గు, రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.దీనిని తమిళనాడులో ప్రసిద్ధ మూలికలలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు.

ఈ మొక్క ఆకుల కషాయాలను రక్తపోటు చికిత్సకోసం తమిళనాడులో సిద్ధ వైద్యులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ అడవి దోసలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది మూత్ర సంబంధ సమస్యలు తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.

కొంతమంది సాంప్రదాయ వైద్యుడు కామెర్లు నివారణకు కూడా ఈ ఆకుల కషాయాన్ని ఉపయోగిస్తున్నారు ఇటువంటి మొక్కలను ఆరోగ్యపరంగా ఉపయోగించినప్పుడు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుడి సంపాదించి వాడటం చాలా ముఖ్యం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."