బ్యూటీ పార్లర్ వద్దు.. ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లో మోచేతులు, మోకాళ్ల నలుపును ఇలా ఇట్టే మాయం చేయండి!
How to Get rid of Dark Elbows and Knees : మీకు ఇష్టమైన హాఫ్ హ్యాండ్స్ లేదా స్లీవ్ లెస్ బట్టలు వేసుకోవాలని ఉన్నా.. మోచేతుల దగ్గర నలుపు (Dark Elbows) చూసుకుని మొహమాట పడుతున్నారా? స్నానం చేసేటప్పుడు సబ్బుతో ఎంత గట్టిగా రుద్దినా ఆ మొండి నలుపు వదలడం లేదా? అయితే మీరు ఒంటరి కాదు, చాలామందికి ఈ సమస్య ఉంటుంది.
కానీ, దీన్ని వదిలించుకోవడానికి పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే ఈ మొండి నలుపును ఎలా సులువుగా మాయం చేయాలో ఈ ఆర్టికల్ లో మీకోసం వివరంగా రాశాను. ఈ సింపుల్ చిట్కాతో మీ మోచేతులు మళ్లీ అందంగా మెరిసిపోవడం ఖాయం!

మోకాళ్ళు, మోచేతుల మీద నలుపు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ నలుపును తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితాన్ని ఇవ్వక ఎంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో ఒక షాంపూ పేకెట్ లో షాంపూను వేయాలి. దానిలో అరచెక్క నిమ్మరసం, రెండు స్పూన్ల టమోటా రసం, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై నలుపు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గి మృదువుగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టమోటా,నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు నలుపును తగ్గించటానికి సహాయపడతాయి. ఆర్గానిక్ పసుపు వాడితే మంచిది. షాంపూ ఏ కంపెనీ అయిన పర్వాలేదు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

