Beauty TipsHealthhealth tips in telugu

పార్లర్ కు వెళ్లే టైం లేదా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని ఇలా తళతళా మెరిపించుకోండి!

రేపు పెళ్లి లేదా ముఖ్యమైన ఫంక్షన్ ఉందనగా.. అద్దంలో చూసుకుంటే ముఖం డల్‌గా, అలసిపోయినట్లు కనిపిస్తుందా? బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకుందామంటే అసలు టైం దొరకలేదా? ఇక ఆ టెన్షన్ వదిలేయండి!

ఫంక్షన్‌కి వెళ్లే లాస్ట్ మినిట్ హడావిడిలో కూడా, ఇంట్లో ఉండే వస్తువులతోనే కేవలం 10-15 నిమిషాల్లో ముఖాన్ని ఎలా మెరిపించుకోవాలో ఈ ఆర్టికల్‌లో మీకోసం పంచుకుంటున్నాను. ఈ చిన్న ఇన్‌స్టంట్ గ్లో ప్యాక్‌తో, రేపు ఫంక్షన్‌లో అందరి కళ్లు మీ మీదే ఉండేలా చేసుకోవచ్చు. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఇప్పుడే చూసేయండి!

ఒక రోజులో మనం అందంగా మారలేము. కానీ ఉన్నంతలో ఆకర్షణీయంగా ఉండవచ్చు. మరుసటి రోజు ఏదైనా పెళ్లి వేడుక లేదా పుట్టినరోజుకు వెళ్ళవలసి వస్తే ముందు రోజు రాత్రి ఈ చిట్కాలను పాటించండి.

తెల్లవారేసరికి మీ పాదాలు మరియు చేతులు మృదువుగా కనపడాలంటే రాత్రి పూట పెట్రోలియం జెల్లీని రాయాలి. బాదం నూనెతో కూడా మర్దన చేయవచ్చు. తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి కాళ్ళు రెండు కాసేపు ఉంచితే మంచిది.

పెదవులు పొడి బారినట్లు అనిపిస్తూ ఉంటే రాత్రి పడుకొనే ముందు ఆలివ్ ఆయిల్ లో కొంచెం పంచదార కలిపి పెదవులపై రుద్దాలి. దీనివల్ల పెదాలపై మృతకణాలు దూరం అవుతాయి. తర్వాత లిప్ బామ్ రాసుకొని పడుకుంటే ఉదయం పెదాలు మృదువుగా ఉంటాయి.

పని ఒత్తిడి వల్ల కళ్ళు ఉబ్బినట్లు ఉంటే మీ కళ్ళకు చల్లదనంను ఇచ్చే ఐ క్రీం ను ఫ్రిడ్జ్ లో పెట్టండి. రాత్రి పడుకునే ముందు తీసి కళ్ళ క్రింద రాసుకుంటే ఉదయం వాపు తగ్గి తాజాగా కనిపిస్తాయి. ఐ క్రీం కి బదులుగా బాదం నూనెను ఉపయోగించవచ్చు.

కనురెప్పలకు ఉన్న వెంట్రుకలు ఒత్తుగా కనపడాలంటే రాత్రి పడుకొనే ముందు కాస్త ఆముదం నూనెను కనురెప్పలకు రాయాలి. ఉదయం లేచాక వేడి నీళ్ళతో కడగాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."