Healthhealth tips in telugu

హై బీపీ ఉన్నవారు సోంపు తింటే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Fennel Seeds Health benefits In telugu : భోజనం చేసిన తర్వాత కాస్త సోంపు నమిలే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. నోటి దుర్వాసన పోవడానికో లేక తిన్న ఆహారం అరగడానికో సోంపును ఒక మౌత్ ఫ్రెషనర్‌లా వాడుతుంటాం. కానీ ఈ చిన్న సోంపు గింజలు కేవలం జీర్ణక్రియకే కాకుండా, రక్తపోటును (బీపీని) నియంత్రించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయని మీకు తెలుసా?

సోంపులో పుష్కలంగా ఉండే పొటాషియం, నైట్రేట్స్ రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తాయి. అయితే హై బీపీ ఉన్నవారు సోంపును ఎలా తీసుకోవాలి? రోజుకు ఎంత పరిమాణంలో తింటే మంచిది? వంటి ముఖ్యమైన విషయాలను ఈ ఆర్టికల్‌లో సులభంగా తెలుసుకుందాం.

సోంపులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలా మంది భోజనం అయ్యాక సోంపును నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు. అలా చేయటం వలన తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుందని నమ్మకం. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవటం,ఒత్తిడి,ఎక్కువసేపు కూర్చొని ఉండటం,జంక్ foods ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో రక్తపోటు సమస్య వస్తుంది. రక్తపోటు సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు.

రక్తపోటు సమస్య ఉన్నప్పుడు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులను వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సొంపు గింజలు రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. అరస్పూన్ సోంపు గింజలు నమిలితే.. లాలాజలంలో నైట్రెట్ల పరిమాణం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి నేచురల్ రెమిడీ గా పనిచేస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడే వారు ప్రతి రోజూ సోంపు గింజలు నమిలితే మంచిది. సోంపులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తప్రవాహంలో ద్రవం మొత్తాన్ని నియంత్రిస్తుంది. ఇది హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. సోంపు గింజలను నమలడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన పొటాషియం స్థాయిలు ఉండేలా చేస్తుంది.

సోంపులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే సోంపులో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ కరిగిపోకుండా చేస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సోంపును నమలటం ఇబ్బందిగా ఉంటే సోంపు టీ తయారుచేసుకొని తాగవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."