Healthhealth tips in telugu

ఈ ఒక్క గ్లాస్ డ్రింక్‌తో గ్యాస్, ఎసిడిటీ పరార్.. ఆకలి కూడా పెరుగుతుంది!

Gas Problem : గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం మరియు కడుపు మంట సమస్యలతో నిరంతరం బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క గ్లాస్ అద్భుతమైన పానీయంతో మీ జీర్ణ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ డ్రింక్ ఎలా చేయాలో, దీని ప్రయోజనాలు ఏమిటో ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకోండి. ఇది మీ ఆకలిని కూడా సహజంగా పెంచుతుంది!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది గ్యాస్,ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మన వంటింటిలో ఉండే మూడు ఇంగ్రిడియన్స్ ని ఉపయోగించి ఈ చిట్కాను చేస్తున్నాం.
Dhaniyalu Health benefits in telugu
దీని కోసం ఒక గ్లాస్ నీటిలో అరస్పూన్ జీలకర్ర, అరస్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సొంపు వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు తాగితే గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం,ఎసిడిటీ వంటి కడుపుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి.

అలాగే ఆకలి లేనివారిలో ఆకలి పుడుతుంది.ఈ నీటిని తయారుచేసుకోవటానికి మరొక పద్దతి ఉంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో సొంపు,ధనియాలు,జీలకర్ర వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ధనియాలు,జీలకర్ర,సొంపు ఈ మూడింటిలో ఉన్న లక్షణాలు జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."