Kitchenvantalu

నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ‘సేమ్యా బొబ్బట్లు’.. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు!

Semiya Bobbatlu: మనకు పండుగ వచ్చినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చే ట్రెడిషనల్ స్వీట్ ‘బొబ్బట్లు’. సాధారణంగా శనగపప్పు లేదా కందిపప్పుతో పూర్ణం చేసి బొబ్బట్లు చేస్తుంటాం. కానీ, ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త వెరైటీగా, కొత్త రుచితో ఏదైనా స్వీట్ చేయాలనిపిస్తే ఈసారి ‘సేమ్యా బొబ్బట్లు’ (Semiya Bobbatlu) ట్రై చేయండి.

ఇవి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ అద్భుతమైన రుచిని ఇస్తాయి. పప్పు నానబెట్టి, ఉడికించే పని లేకుండా చాలా తక్కువ సమయంలోనే, ఎంతో సులువుగా ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
wheat flour
మరి ఈ కమ్మని సేమ్యా బొబ్బట్లను పర్ఫెక్ట్ గా, మృదువుగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం.బొబ్బట్లు పేరు వినగానే ఎవ్వరికైనా నోట్లో నీళ్లూరుతాయి బొబ్బట్లను సేమియాతో చేసి చూడండి కాస్తా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
సేమియా – 1 కప్పు
చక్కెర – ¾ కప్పు
గోధుమ పిండి – 1 కప్పు
ఉప్పు – కొద్దిగా
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – 5
బాదం – 5
యాలకులు – 2-3

తయారీ విధానం
1.గోధుమ పిండిని బౌల్ వేసి ఉప్పు యాడ్ చేసి కలుపుకోవాలి.
2. రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోని కొద్దిగా కొద్దిగా నీళ్లు వేస్తు పిండిని ముద్దలా కలుపుకోవాలి.
3.చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకోని పిండిని బాగా కలుపుకోని గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు స్టఫ్పింగ్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి వేసుకోని సేమియా వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేపుకోవాలి.
5.వేపుకున్న సేమియాను ప్టేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి.
6.అదే ప్యాన్ లోకి రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించాలి.
7.ఎసరు మరుగుతున్నప్పుడు వేపుకున్న సేమియాను వేసి నీళ్లు ఆవిరి అయ్యే వరకు ఉడికించాలి.

8.ఇప్పుడు అందులోకి చక్కెర వేసి దగ్గరపడే వరకు కలుపుకోవాలి.
9.ఇప్పుడు అందులోకి గ్రైండ్ చేసుకున్న బాదం,కాజు పొడి,యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి.
10.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోని చల్లారనివ్వాలి.
11.చల్లారిన మిశ్రమాన్ని చిన్న బాల్స్ లా చేసుకోవాలి.
12.ఇప్పుడు నానిన గోధుమపిండిని ముద్దలుగా చేసుకోని చపాతిలా వత్తుకోవాలి.
13.అందులోకి రెడీ చేసుకున్న స్టప్ ని పెట్టుకోని పిండితో కవర్ చేసి బాల్స్ లా చేసుకోని పూరి షేప్ లో నెమ్మదిగా తాల్చుకోవాలి.
14.తయారు చేసుకున్న బొబ్బట్లను పెనం పై వేసి నెయ్యి వేసి రెండు వైపులా దోరగా కాల్చుకుంటే సేమియా బొబ్బట్లు రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."