Kitchenvantalu

బీరకాయ తినని వారు కూడా లొట్టలేసుకుంటూ తినే ‘బీరకాయ శనగపప్పు మసాలా’ కర్రీ!

Beerakaya Senagapappu Masala: బీరకాయ పేరు వినగానే ఇంట్లో చాలా మంది ముఖం తిప్పుకుంటారు. రెగ్యులర్ గా చేసుకునే బీరకాయ వేపుడు, లేదా పాలు పోసిన కూర తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, నోటికి రుచిగా తగిలేలా ‘బీరకాయ శనగపప్పు మసాలా’ (Beerakaya Senagapappu Masala) ట్రై చేసి చూడండి.

ఉడికించిన శనగపప్పు కమ్మదనం, మనం వేసే స్పెషల్ మసాలా ఘాటు కలగలిపి ఈ కూరకు అద్భుతమైన రుచిని ఇస్తాయి. కూరగాయలు తినమంటే మారం చేసే పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే.. ఈ కర్రీ చేస్తే వదలకుండా తింటారు. వేడి వేడి అన్నం, రోటీ, పూరీ, చపాతీ.. ఇలా దేనిలోకైనా అదిరిపోయే ఈ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం.
Beerakaya benefits
ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలంటే చాలా వరకు ఇష్టపడరు. బీరకాయ రెసిపి అంటే పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు.కాని శనగపప్పు తో మిక్సి చేసి మసాలా కర్రీ చేసి చూడండి బీరకాయ కూడ వదలకుండా తినేస్తారు.

కావాల్సిన పదార్ధాలు
బీరకాయ – ¼ kg
శనగపప్పు – ½ కప్పు
పచ్చిమిర్చి – 2
ఉల్లిపాయలు – 1
జీలకర్ర – ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
కారం – 1/ ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
ధనియాలు – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా బీరకాయలను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసిపెట్టుకోవాలి.
2.శనగపప్పు అరగంట పాటు నానబెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర ,ఆవాలు,తరగిని పచ్చిమిర్చి,ఉల్లిపాయలు వేసి రంగుమారే వరకు వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక బీరకాయ ముక్కలను వేసి కలుపుకోని మూతపెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
5.ఇప్పుడు అందులోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసి కారం,ఉప్పు,ధనియాలపొడి వేసి బాగా కలుపుకోని కప్పు నీళ్లను జోడించి నిమిషం పాటు ఉడకనివ్వాలి.
6.నిమిషం తర్వాత బీరకాయ కర్రీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ మసాలా శనగపప్పు కూర రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."