Beauty TipsHealthhealth tips in telugu

తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన నూనె.. ఈ ఆకులతో ఇలా తయారు చేసుకోండి!

White Hair turn black Home Remedies:ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘తెల్ల జుట్టు’ (Premature Graying). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. దీన్ని కవర్ చేయడానికి రసాయనాలతో కూడిన హెయిర్ డైలు వాడి జుట్టును మరింత పాడుచేసుకుంటున్నారు.

కానీ, మన చుట్టూ దొరికే ఒక అద్భుతమైన ఆకులతో ఇంట్లోనే నూనె తయారు చేసి వాడితే, తెల్ల జుట్టు సమస్యకు న్యాచురల్‌గా చెక్ పెట్టవచ్చు. కుదుళ్ల నుంచి జుట్టును నల్లగా, దృఢంగా మార్చే ఆ ఆకులు ఏంటి? ఆ నూనెను ఎలా తయారు చేసుకోవాలి? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం.

మారిన పరిస్థితి కారణంగా ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా తెల్లజుట్టు సమస్య,జుట్టు రాలిపోవటం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. తెల్లజుట్టు సమస్య, జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇపుడు చెప్పే నూనెను వాడితే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

అలాగే తెల్లజుట్టు సమస్య కూడా తగ్గుతుంది. ఒక్కసారి ఈ నూనెను తయారుచేసుకుంటే నెల రోజుల పాటు వాడవచ్చు. 250 గ్రాముల కొబ్బరి నూనెలో 10 మందార ఆకులు లేదా 5 మందార పువ్వులు ,గుప్పెడు వేప ఆకులు, 5 ఆముదం ఆకులు,గుప్పెడు తంగేడు ఆకులు,అరకప్పు కలబంద గుజ్జు, గుప్పెడు గుంటగలగరాకు, అరకప్పు ఎండిన ఉసిరి ముక్కలు,గుప్పెడు గోరింటాకు, రెండు స్పూన్ల మెంతులు , వట్టివేర్లు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి 15 నిమిషాల పాటు మరిగించాలి.

మరిగిన ఈ నూనెను వడకట్టి ప్రతి రోజు జుట్టుకు రాస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్నవారు ఈ నూనెను వాడితే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. సహజసిద్దమైన వస్తువులతో తయారుచేసుకోవటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

ఈ నూనెను ఒక్కసారి తయారుచేస్తే నెల రోజుల వరకు వాడుకోవచ్చు. మార్కెట్ లో దొరికే నూనెలు కన్నా సహజసిద్దంగా చేసుకున్న నూనెలను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెను కాస్త ఓపికగా చేసుకోవాలి. ఈ నూనెలో వాడిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."