Healthhealth tips in telugu

రోజూ ఈ 1 గ్లాస్ డ్రింక్ తాగితే చాలు.. పొట్టలోని చెత్తంతా మాయం, ఇమ్యూనిటీ డబుల్!

Raavi Aaku Benefits :మన ఆరోగ్యం అంతా మన పొట్టపైనే ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు, పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి పేగులను శుభ్రపరిచే ఒక అద్భుతమైన డ్రింక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. రోజూ ఉదయాన్నే ఈ ‘1 గ్లాస్’ తాగితే మీ ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ఈ పోస్ట్‌లో చదవండి.

రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. అలాగే రావి చెట్టు కింద కూర్చోమని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఎందుకంటే రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ అందిస్తుంది. రావి ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెండు రావి ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి.
Raavi aaku
ఈ కషాయం తాగటం వలన ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా,పురుగులు తొలగిపోతాయి. ఇవి గ్యాస్ ఏర్పడటానికి,కడుపునొప్పికి కారణం అవ్వటమే కాకుండా పిల్లల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. పొట్టను శుభ్రం చేస్తుంది. రావి ఆకులో flavonoids, piperine, piperlangumine సమృద్దిగా ఉండుట వలన శరీరంలో ఎక్కువ యాంటీబాడీలను ఉత్పత్తి చేసి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

ఈ కషాయం ఫిట్స్‌ తీవ్రతను తగ్గించటానికి సహాయపడుతుంది. మన శరీరంలో సెరోటోనిన్ వంటి రసాయనాలు న్యూరోట్రాన్స్‌మిటర్‌లుగా పనిచేస్తాయి. న్యూరోట్రాన్స్‌మిటర్‌ యొక్క కార్యాచరణను మెరుగుపరచటం ద్వారా పిట్స్ ని తగ్గిస్తుంది. దగ్గు, కఫం, శ్లేష్మం మరియు ఉబ్బసం ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

రావి ఆకులలో ఫినోలిక్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లుగా పనిచేసి నోటిలో, పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."