జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అయితే వెంటనే ఈ అద్భుతమైన చిట్కాలు ట్రై చేయండి!
Hair fall remedies:దువ్వెన పట్టుకుంటే భయమేస్తోందా? తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అయితే ఇక ఏమాత్రం ఆందోళన చెందకండి! మీ జుట్టు రాలడాన్ని వెంటనే ఆపి, కురులను ఒత్తుగా మార్చే కొన్ని అద్భుతమైన ఇంటి చిట్కాల గురించి ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకుందాం. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ జుట్టు రాలడం ఖచ్చితంగా తగ్గుతుంది.
జుట్టు రాలడం తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.. జుట్టు చిక్కులు లేకుండా మృదువుగా ఉండాలన్నా, జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలన్నా ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

జుట్టురాలే సమస్యకు ఖరీదైన ప్రొడక్ట్స్ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
ఒక బౌల్లో ఒక స్పూన్ వెన్న తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు మృదువుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com.

