Kitchenvantalu

మైదా, కోవా అక్కర్లేదు.. ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే జ్యూసీ గులాబ్ జామున్ చేసుకోండిలా!

Wheat Flour Gulab Jamun:గులాబ్ జామున్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అయితే బయట దొరికే ఇన్స్టంట్ మిక్స్ లేదా మైదాతో కాకుండా, మన వంటింట్లో ఎప్పుడూ ఉండే గోధుమ పిండితో అంతే రుచిగా గులాబ్ జామున్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా!

అవును, మీరు విన్నది నిజమే. ఇది గోధుమ పిండితో చేశారని మీరు చెప్తే గానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. లోపల వరకు పాకం పీల్చుకుని పర్ఫెక్ట్‌గా, జ్యూసీగా వచ్చే ఆరోగ్యకరమైన గోధుమ పిండి గులాబ్ జామున్ తయారీ విధానం, పిండి కలుపుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్‌లో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం.

గోధుమ పిండి గులాబ్ జామున్స్.. గులాబ్ జామున్ అంటే అందరు ఇష్టంగా తింటుంటారు. ఇంట్లో ఉన్న గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే గులాబ్ జామూన్స్ చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్
చక్కెర – 1 కప్పు
యాలకుల పొడి – కొద్దిగా
వంట సోడా – కొద్దిగా
నెయ్యి – తగినంత

తయారీ విధానం
1.ప్యాన్ నెయ్యి వేడి చేసి గోధుమ పిండి,బొంబాయి రవ్వవేసి దోరగా వేపుకోవాలి.
2.వేపుకున్న పిండిని వేరొక ప్లేట్ లోకి ట్రాన్సఫర్ చేసుకోవాలి.
3.వేపుకున్న పిండిలో యాలకకుల పొడి ,వంట సోడా కరిగించిన నెయ్యి వేసి కొద్ది కొద్దిగా పాలు వేస్తూ మిక్స్ చేసుకోవాలి.
4.పిండిని మెత్తగా కలుపుకోని పది ,పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి.
5.ఇప్పుడు చక్కెర సిరప్ కోసం కప్పు నీళ్లు ,కప్పు చక్కెర వేసి మిక్స్ చేసి మరిగించాలి.

6.సిరప్ మరుగుతున్నప్పుడు యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని జామూన్స్ తయారు చేసుకోవాలి.
8.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె ,లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
9.తయారు చేసుకున్న జామూన్స్ ని నూనెలో వేసుకోని బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు వేపుకోవాలి.
10.వేపుకున్న జామూన్స్ ని వేడిగా ఉన్నప్పుడే చక్కెర సిరప్ లో వేసుకోవాలి.
11.రెండు గంటల పాటు సిరప్ లో జామూన్స్ నానాక సర్వ్ చేసుకోవడమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."