Kitchenvantalu

కరకరలాడే వడలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి!

Sweet Corn Vada: స్వీట్ కార్న్‌తో ఎప్పుడూ ఒకేలా కాకుండా, ఇలా డిఫరెంట్‌గా మరియు టేస్టీగా కరకరలాడే వడలు చేసి చూడండి. అప్పటికప్పుడు ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా సులభంగా తయారు చేసుకునే ఈ స్వీట్ కార్న్ వడలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ భలే నచ్చుతాయి. వడలు నూనె పీల్చకుండా, పర్ఫెక్ట్ షేప్ మరియు రుచితో రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఈ సీజన్ లో Sweet Corn చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. Sweet Corn లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Sweet Corn ని ప్రతి సారి ఉడికించి తింటే బోర్ కొడుతుంది. అలాగే పిల్లలు కూడా తినటానికి ఇష్టపడరు. Sweet Corn Vada చేస్తే చాలా ఇష్టంగా తింటారు. Sweet Corn Vada తయారుచేయటం కూడా సులభం.

కావలసిన పదార్ధాలు
ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు
అరకప్పు ఉల్లిపాయ ముక్కలు
ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేయాలి
ఒక అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి
రెండు రెబ్బల కరివేపాకు
ఒక క్యారెట్ తురమాలి
రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు
పావు స్పూన్ పసుపు
పావు కప్పు శనగపిండి
పావు కప్పు బియ్యప్పిండి
అర స్పూన్ ఉప్పు
నూనె వేగించడానికి

తయారీ విధానం
ఒక స్వీట్ కార్న్ తీసుకొని గింజలను వలిచి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. స్వీట్ Corn పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా తయారు చేసుకుని నూనెలో వేగిస్తే చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ. సాయంత్రం TEA సమయంలో స్నాక్ రూపంలో తీసుకుంటే చాలా బాగుంటాయి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."