ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రక్తహీనతకు (Anemia) చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా?
cauliflower stems : ఒంట్లో రక్తం తక్కువగా ఉందా? రక్తహీనత (Anemia) సమస్యతో తరచుగా నీరసపడిపోతున్నారా? ఖరీదైన మందులు, టానిక్లతో పనిలేకుండా ఒక్క పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే సహజమైన ఆహారాలతో శరీరంలో రక్తాన్ని వేగంగా ఎలా పెంచుకోవాలో ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకోండి
క్యాలీఫ్లవర్ ని వండినప్పుడు వాటి కాడలను పాడేస్తూ ఉంటాం. వాటిలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య నుండి బయట పడాలంటే ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

పురుషుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 14 నుండి 16 గ్రాములు, అలాగే స్త్రీలలో 12 నుండి 14 గ్రాములు వరకు ఉండాలి. హిమోగ్లోబిన్ శాతం పెరగటానికి, రక్తకణాలు వృద్ది చెందటానికి ప్రతి రోజు సుమారుగా 30 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది.క్యాలీఫ్లవర్ లో కంటే కాడల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. క్యాలీఫ్లవర్ కాడల్లో ఐరన్ చాలా సమృద్దిగా ఉంటుంది.
100 గ్రాముల క్యాలీఫ్లవర్ కాడలలో దాదాపుగా 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిని కూర రూపంలో గాని, ఫ్రై రూపంలో గాని తినవచ్చు.
అలాగే పాలు పోసుకుని కూరగా చేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. వారంలో మూడు సార్లు క్యాలీఫ్లవర్ కాడలను ఆహారంలో బాగంగా చేసుకుంటే శరీరంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
రక్తహీనత సమస్య ఉన్నప్పుడూ సాధ్యమైనంత వరకు ఆహారంలో మార్పులు చేసుకొని ఆ సమస్య నుండి బయట పడవచ్చు. రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలు అప్తించలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

