Kitchenvantalu

కేవలం 5 నిమిషాల్లో అదిరిపోయే క్యారెట్ పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!

Instant Carrot Chutney Recipe: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు అప్పటికప్పుడు నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే ఈ క్యారెట్ పచ్చడి మీకు బెస్ట్ ఆప్షన్. కేవలం 5 నిమిషాల్లో చాలా సులభంగా, అత్యంత రుచికరంగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు.

వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తిన్నా, లేదా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్‌తో నంజుకుని తిన్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తినే ఈ ఇన్స్టంట్ క్యారెట్ చట్నీ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్‌లో వివరంగా తెలుసుకుందాం
Carrot
క్యారేట్ పచ్చిది తిన్న బలమే, పచ్చడి చేసుకుని తిన్నా బలమే, కంటికి, వంటికి, మేలు చేసే క్యారేట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
క్యారేట్ తురుము – 200 గ్రాములు
నూనె – 1.5 టేబుల్ స్పూన్
మెంతులు – ½ టీస్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
పచ్చిమిర్చి – 3 లేదా 4
ఉప్పు – తగినంత
ఇంగువ – చిటికెడు
చింతపండు – ఉసిరి కాయ అంత సైజ్
కొత్తమీర – తాళింపు కోసం.
నూనె – 1.5 టీ స్పూన్
ఆవాలు – 1/2టీస్పూన్
జీలకర్ర – 1/2టీస్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెబ్బలు

తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేడి చేసి అందులో, మెంతులు, ఆవాలు, వేసుకుని, ఎర్రగా వేపుకోవాలి.
2. అందులోకి మినపప్పు, శనగపప్పు, వేసి వేపాలి.
3. తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు వేసి, స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వేపుకోవాలి.

4.చల్లారిన తాళింపు మిక్సీజార్ లోకి వేసుకుని, మెత్తని పొడి చేసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు పచ్చడి తాళింపు కోసం, కడాయిలో నూనె వేడి చేసి, అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేసుకుని, చివరగా కరివేపాకు వేసి వేపాలి.
6. వేగిన తాళింపులోకి స్టవ్ ఆఫ్ చేసి, క్యారేట్ తురుము , గ్రైండ్ చేసుకున్న తాళింపు పొడి వేసి, ఉప్పు వేసి, బాగా కలుపుకుని, గంట పాటు, వదిలేస్తే, క్యారేట్ పచ్చడి రెడీ అయిపోయినట్లే..

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."