Beauty TipsHealthhealth tips in telugu

నల్లటి మోచేతులు, మోకాళ్లను తెల్లగా మార్చే అద్భుతమైన న్యాచురల్ చిట్కాలివే!

Reduces Dark Elbows Home Remedies in telugu :ముఖం ఎంత కాంతివంతంగా ఉన్నా.. మోచేతులు, మోకాళ్లు నల్లగా, గరుకుగా ఉంటే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకోవాలంటే మొహమాట పడుతుంటారు. ఎండ ప్రభావం, మృతకణాలు పేరుకుపోవడం, చర్మం పొడిబారడం వల్ల ఈ సమస్య వస్తుంది.

అయితే, ఖరీదైన క్రీమ్స్, బ్యూటీ పార్లర్లతో పనిలేకుండా.. మన ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతో ఈ నలుపును చాలా సులభంగా వదిలించుకోవచ్చు. ఆ బెస్ట్ హోమ్ రెమెడీస్ ఏంటి? వాటిని ఎలా వాడాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.”

మోచేతులు నల్లగా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ సులభమైన చిట్కాలను ట్రై చేసేయ్యండి.. సాధారణంగా మహిళల మోచేతుల వద్ద నల్లబడి, చర్మం మొద్దుబారిపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది.

మిగతా చర్మం ఎంత అందంగా, మృదువుగా ఉన్నా మోచేతి కారణంగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మోకాళ్లపై కూడా చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ ఖర్చుతో కేవలం రెండు ఇంగ్రిడియన్స్ తో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం బంగాళాదుంప తీసుకోవాలి. బంగాళాదుంపను ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.

బంగాళాదుంప పేస్ట్ లో నిమ్మరసం కలిపి నలుపు ఉన్న మోచేతులు, మోకాళ్ళపై రాసి 15 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గి మృదువుగా తెల్లగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బంగాళాదుంప,నిమ్మరసంలో ఉన్న లక్షణాలు నలుపును తగ్గించటానికి సహాయపడుతుంది. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."